బాస్ ని సంతృప్తి పరిస్తే.. బిగ్ బాస్ అవకాశం

1461
Anchor Swetha Reddy Sensational Comments on Bigg Boss
Anchor Swetha Reddy Sensational Comments on Bigg Boss

బిగ్ బాస్ టీవీ షో లో అవకాశం కావాలంటే పెద్ద గా చేయాల్సింది ఏమి లేదు. ఏ సెలబ్రెటీ అయితే మంచి రేటింగ్స్, వ్యూస్ వస్తాయో అంచనా వేసుకొని, షో నిర్వాహకులే వాళ్ళని అప్రోచ్ అవుతారు. ఇది అందరూ అనుకునే విషయం. కాకపోతే ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది అని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. యూట్యూబ్ లో ఇంటర్వూస్ చేస్తూ పాపులర్ అయినా శ్వేతా రెడ్డి అనే యాంకర్ ని బిగ్ బాస్ నిర్వాహకులు అప్రోచ్ అయ్యారట. శ్వేతా కూడా షో లో పాల్గొనడానికి సుముఖత వ్యక్తం చేయడం తో షో కి సంబందించిన కో ఆర్డినేటర్ ఒకరు శ్వేతా తో ఒప్పందాల మీద సంతకాలు చేయించారట. అయితే షో వివరాలు వేరొకరు చెప్తారు అని చెప్పి వెళ్లిపోయారట.

కొద్దీ రోజులకి వేరొకరు వచ్చి “మా బాస్ ని సంతృప్తి పరచడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి” అని అడిగారు అని ఆవిడ ఇటీవలే వెల్లడించింది. ఇప్పుడు ఆవిడ ఈ షో మీద చేస్తున్న కామెంట్స్ బాగా హైలైట్ అయ్యాయి. కాకపోతే ఆమె తో మాట్లాడిన వ్యక్తి నిజానికి బిగ్ బాస్ ఉద్యోగేనా అనే సందేశాలు కూడా వెలువడుతున్నాయి. ఇదే నిజం అయితే బిగ్ బాస్ షో కి కూడా తిప్పలు తప్పేలా లేవు.

Loading...