సుచరిత హయాంలో నేరాలు ఎక్కువగా జరిగాయా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మంత్రి మేకతోటి సుచరిత పై కేంద్రం ఒత్తిడి పెంచనుందా అంటే అవుననే అంటున్నాయి కేంద్ర వర్గాలు.. ఇప్పటికే తమకు రక్షణ కరువైందని పలువురు మహిళలు రోడ్డెక్కడం చూసాం.. దిశా వంటి సంఘటనలు రాష్ట్రంలో రోజుకొకటి జరుగుతుండగా హోమ్ మంత్రి పనితీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇక ఎస్సీల పై , గిరిజనులపై జరుగుతున్న దాడులను కూడా చెప్తూ విమర్శిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఓ నివేదిక అందింది. కేంద్ర నేర‌గ‌ణాంకాల విభాగం ఈ నివేదిక‌ను రాష్ట్రానికి పంపించింది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఏటా .. రాష్ట్రాల్లోను, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ నేరాలు, ఘోరాల‌పై ఓ నివేదిక‌ను రూపొందిస్తారు.

ఈ నివేదిక లో రాష్ట్రం టాప్ లో ఉంది.. అంటే నేరాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం గా ఉందన్న మాట.. రాష్ట్రంలో కేసులు దేశంలోని బిహార్‌, ఉత్తర‌ప్రదేశ్ వంటి అత్యంత వెనుక‌బ‌డిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ‌గా ఉన్నారు. మొత్తం కేసుల శాతం 4.4గా ఉంది. ఇది ద‌క్షిణాది రాష్ట్రాల్లో రెండో స్థానాన్ని సూచించింది. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై పెరుగుతున్న దాడులు ఇంకా కొన‌సాగుతున్నాయి. అదేస‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీల‌పైనా అత్యాచారాలు, ఇత‌ర నేరాలు, నిర్బంధాలు పెరుగుతున్నాయి.

- Advertisement -

అలాగే పోలీసులపై నమోదు అయ్యే కేసులు కూడా ఎక్కువే ఉన్నట్లు తెలుస్తుంది.. 1681 కేసులు కేవ‌లం పోలీసుల‌పైనే న‌మోదు కావ‌డంతో హోమ్ మంత్రి సుచరిత పనితనం ఎలా ఉందొ అర్థమవుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.. అయితే దీనికి మేకతోటి సుచరిత బాధ్యత వహించక తప్పదు అని అంటున్నారు.. ఆమె వైఫల్యమే దీనికి కారణం అంటున్నారు.. ఆమెకు స్వేచ్ఛ లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అంటున్నారు.. కారణం ఏదైనా చివరికి బ్యాడ్ నేమ్ మాత్రం ఆమెకే వచ్చేది.. దీన్ని ఆమె ఏవిధంగా సరిదిద్దుకుంటారా చూడాలి..

Most Popular

Related Articles

మంత్రి సుచరిత ఘోర అవమానం.. ఏం జరిగింది ?

జగన్ అంటే ఎంతో ప్రాణంగా గౌరవించే ఆ మహిళా మంత్రికి అవమానం జరిగిందా ? అంటే అవును అనే అంటున్నారు వైసీపీ నేతలు. ఈ విషయం పార్టీలో ప్రస్తుతం హాట్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...