డ్రీం 11 సంస్థకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..?

- Advertisement -

ఆన్ లైన్ బెట్టింగ్ సంస్థ డ్రీం 11 కంపెనీ ఒక్కసారి గా ఈ సంవత్సర IPL బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయి అందరికి సాలిడ్ షాక్ ఇచ్చింది.. పెద్ద పెద్ద కంపెనీలు సాధించలేని,వేయలేని టెండర్ అమౌంట్ ని వేసి అతి తక్కువ కాలంలో ఇంత ఎదిగిన కంపెనీ కి ఇన్ని లాభాలు వచ్చాయా అని ముక్కున వేలేసుకునేటట్లు చేసింది ఆ కంపెనీ.. చైనా ని బహిష్కరించే క్రమంలో వివో ని తొలగించిన బీసీసీఐ స్పాన్సర్షిప్ కి బిడ్డింగ్ లు ఇవ్వగా అందరికంటే ఎక్కువ బీడ్ చేసి డ్రీం 11 ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకుంది..

పొట్టి ఓవర్ల క్రికెట్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కావడంతో బెట్టింగుల పర్వం జోరందుకుంది. డ్రీమ్ 11లో ఇవాళ మ్యాచ్ జరిగే జట్ల నుంచి ప్లేయర్స్‌ను ఎంచుకొని యూజర్లు తమ డ్రీమ్ జట్టును ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఆ మ్యాచ్‌లో యూజర్లు ఎంచుకున్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా పాయింట్లు వస్తాయి. ఆ కంటెస్ట్‌లో విజయం సాధించిన వారు డబ్బులు గెలుచుకోవచ్చు. అయితే దీనిలో యూత్ ఎక్కువగా పాల్గొంటుండడంతో డబ్బులను పోగొట్టుకుని అప్పులు చేసుకుంటారన్న నేపధ్యంలో డ్రీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో డబ్బులు పెట్టి ఆడటంపై తెలంగాణ, అసోం, ఒడిశా, నాగాలాండ్‌ ప్రభుత్వాలు నిషేధం విధించాయి.

- Advertisement -

అయితే తాజాగా ఏపీలో కూడా ఐపీఎల్ స్పాన్సర్ డ్రీమ్ 11పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్‌లో ఇటీవల చేసిన సవరణల కారణంగా ఏపీలోని డ్రీమ్ 11 యూజర్లు పెయిడ్ కంటెస్ట్‌లో జాయిన్ అవ్వలేకపోతున్నారు. అయితే డ్రీమ్ 11 యాప్‌లో ఉచితంగా ఫాంటసీ క్రికెట్ ఆడుకోవచ్చు కానీ, డబ్బులు చెల్లించే కంటెస్ట్‌లపై మాత్రమే నిషేధం విధించింది. అయితే ఇప్పటికే తమ వ్యాలెట్‌లో ఉన్న డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవాలని అని చాలా మంది యూజర్లు ప్రశ్నిస్తుండగా వాలెట్ నుంచి నగదు ఉపసంహరణపై డ్రీమ్ 11 స్పందించింది. మీ డబ్బులు డ్రీమ్‌ 11 వాలెట్‌లో సేఫ్‌గా ఉంటాయని, దీనికి సంబంధించిన వివరాల కోసం http://d11.co.in/HelpCenter లోకి వెళ్లి కాంటాక్ట్ అజ్ కింద మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ డబ్బును తిరిగి చెల్లిస్తామని చెప్పుకొచ్చింది.

Most Popular

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

Related Articles

ఖ‌మ్మంలో స‌రికొత్త రాజ‌కీయ ఆవిష్క‌ర‌ణ‌….

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ల‌లేం. మ‌ద్ద శ‌త్రువులుగా ఉన్న పార్టీలు ఎప్పుడు మిత్రులు అవుతారో...మిత్రులుగా ఉన్న పార్టీలు శ‌త్రువులుగా మార‌డం రాజీకీయాల్లో స‌హ‌జం. అలాంటి సంఘ‌ట‌నే ఇప్పుడ దేశ రాజ‌కీయాల్లో చోటు...

పిల్లవాడిని కాపాడిన ప్రయాణీకుడు

ముంబై లో అంబెర్‍నాథ్  రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రయాణీకులతో చాలా రద్దీగా ఉంటుంది. సాయంత్ర సమయల్లో మరి ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి అదే రైల్వే స్టేషన్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రద్దీ చాలా ఉండటంతో  ప్రయాణీకుల స్టేషన్ లో రైల్వే ట్రాక్  దాటుతు ఉన్నారు.

- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...