Friday, April 19, 2024
- Advertisement -

ముగిసిన ఏపీ కేబినేట్ భేటీ….క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేబినేట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, చట్టసవరణ ముసాయిదాలకు క్యాబినెట్ ఆమోదం పలికింది. జుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటుపై చట్ట సవరణకు చేసిన ప్రతిపాదనలకు క్యాబినెట్‌ పచ్చజెండా ఊపింది. అలాగె ప్ర‌భుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్న 1,33,867 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది.

స్సీ, ఎస్టీ, బీసీలకు మైనార్టీలకు 50 శాతం నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ వర్క్‌లు కేటాయించేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని కేబినెట్‌ నిర్ణయించింది. కౌలు రైతుల రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపడంతోపాటు.. యాజమాని హక్కులకు భంగం కలగకుండా.. 11 నెలల పాటు రైతులకు సాగు ఒప్పందం కుదుర్చుకునేలా బిల్లుకు ఆమోదం తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో 11,114 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటుకు కేబినెట్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. మ‌రో వైపు అంగ‌న్ వాడీల జీతాల పెంపున‌కు కేబినేట్ ఆమోదం తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -