Friday, April 26, 2024
- Advertisement -

రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆందోళ‌న‌లో రోజా….? జ‌బ‌ర్ద‌స్తే దిక్కా…?

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌ల‌రాత‌ను మార్చె ఎన్నిక‌ల ఫ‌లితాల‌కోసం ప్ర‌జ‌లు, అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఎదురుచూస్తున్నారు. ఫ‌లితాలు వెలువ‌డ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుండ‌టంతో మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి ప‌రిస్థితులు అనుకూలిస్తున్నాయ‌ని అన్ని స‌ర్వేలు తేల్చి చెప్ప‌డంతో ఆ పార్టీనేత‌లంద‌రూ ఉత్సాహంగా ఉన్నారు. జ‌గ‌న్ కూడా గెలుపుపై ధీమాతో ఉన్నారు.

ఇద‌లా ఉంటె పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చ‌కున్న రోజా మాత్రం గెలుపుపై పూర్తి డైల‌మాలో ఉన్న‌ట్లు స‌మాచారం. పోలింగ్‌ముగిసిన వెంట‌నె గెలుపుపై ధీమాగా ఉన్న రోజా రానురాను గెలుపుపై ఆశ‌లు స‌న్న‌గిల్లుతున్న‌ట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వ‌స్తె మంత్రి రేసులో ముందుగా రోజా పేరు వినిపిస్తోంది. జ‌గ‌న్ కూడా అందుకు సుముఖంగా ఉన్నార‌నె చెప్పాలి.

రాష్ట్రం అంత‌ట‌తా వైసీపీకీ అనుకూల ప‌వ‌నాలువీస్తుంటె రోజా పోటీ చేస్తున్న న‌గ‌రిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. నాలుగేళ్ల‌పాటు పార్టీకి చేసిన సేవను జగన్ గుర్తించినా.. తీరా వైసీపీ పవనాలు వీస్తున్న సమయంలో ఆమె డూ ఆర్ డై పరిస్థితి ఎదుర్కొంటోంది. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 700 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈసారి రోజా గెలుపు అంతం సుల‌భం కాద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్న రోజా…ప్ర‌భుత్వం ఏర్పాడిన త‌రువాత కీల‌క మంత్రి ప‌ద‌వికి ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జ‌గ‌న్ కూడా రోజాకు మొద‌టినుంచి ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు.నాలుగేళ్ల పాటు పార్టీకోసం కష్టపడి.. తీరా పార్టీ గెలిచే స‌మ‌యానికి తాను గెల‌వ‌కుండా ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏమవుతుందోన‌నే ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

రోజా గెలిస్తే కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డానికి అధినేత సుముఖంగా ఉన్నా..గెలుపు సాధ్య‌మ‌వుతుందా లేదా అనే టెన్ష‌న్ రోజాకు ఎక్కువ అయినట్లు సమాచారం. ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రోజా ఓడిపోతె మాత్రం రోజా అంత దుర‌దృష్ట‌వంతులు ఎవ‌రూ ఉండ‌రేమో….? ఓడిపోతె జ‌బ‌ర్ధ‌స్త్ కంటిన్యూ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -