Friday, March 29, 2024
- Advertisement -

పోలవరం కాంట్రాక్టర్ రద్దుకు కేబినేట్ ఆమోదం…నవయుగకు షాక్..

- Advertisement -

సీఎం వైఎస్ అధ్యక్షతన 38 అంశాలతో ఏపీ కేబినేట్‌ కొనసాగుతోంది. ఈ సమావేశంలో టీడీపీకీ షాక్ ఇస్తూ పలు అంశాలపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుకు అంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 3216.11 కోట్ల టెండర్‌ను గత ప్రభుత్వం నవయుగ సంస్థకు కేటాయించగా దాన్ని రద్దు చేసి రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

మరో వైపు కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీ చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.ఇసుక విధానం, రివర్స్‌ టెండరింగ్‌, ఆర్టీసీ విలీనం తదితర దాదాపు 30 కీలక అంశాలపై సమావేశంలో చర్చ కొనసాగుతోంది.ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది.

మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం మంత్రివర్గం తెలిపింది.ఇప్పటి వరకు పనులు ప్రారంభించక పోవడంతో మచిలీపట్నం పోర్టు ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాలకు కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.. అలాగే మావోయిస్టులపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ఆమోదం తెలిపింది.

నూతన ఇసుక పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం టన్ను ఇసుక రూ.370కే లభిస్తుందని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం స్టాక్ యార్డులను గుర్తించింది. సీఎం జగన్ గురువారం స్వయంగా ఇసుక పాలసీని ప్రకటించనున్నారు.జగన్ జిల్లాల పర్యటన, రచ్చబండ, ప్రజాదర్బారు లాంటి కార్యక్రమాల గురించి కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు పలు కీలక అంశాలపై కూడా కేబినేట్ చర్చ కొనసాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -