Thursday, April 25, 2024
- Advertisement -

రాష్ట్రమంతా క్యాపిటల్ క్యాబినెట్ పై చర్చ

- Advertisement -

జీఎన్ రావు కమిటీ ఇటివలే రాజధానులపై ఓ నివేదికను జగన్ కు అందంచజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నివేదికపై ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ రోజు చర్చించబోతున్నారు. అయితే అమరావతిలో రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నారు.

రాజధానిని అమరావతి నుంచి మార్చవద్దని పట్టుబడుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఏపీ రాజధానిపైన, మూడు రాజధానుల విషయంపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం కొత్త రాజధాని పేరు చెబుతామని మంత్రులు ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. అయితే జీఎన్ రావు కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదిచినట్లు అయితే ఆ వెంటనే రాజధానిగా విశాఖ అన్న ప్రకటన, కర్నూలులో శాశ్వత హైకోర్టుకు గ్రీన్ సిగ్నల్ రావచ్చని తెలుస్తోంది.

అంతేకాకుండా ఇదే సమావేశంలో రైతులకు భరోసాను ఇచ్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీ సందర్భంగా వెలగపూడి సచివాలయం వద్ద భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం మొత్తం 144 సెక్షన్ విధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -