జగన్ కేబినెట్ లో సంపన్నులెవరు? పేదలెవరు?

994
AP CM YS Jagan and Cabinet Ministers Assets
AP CM YS Jagan and Cabinet Ministers Assets

జగన్ కేబినెట్ కొలువుదీరింది. 25మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.అయితే ఏపీ ప్రభుత్వంలోని మంత్రుల్లో సంపన్నులు ఎవరు? పేదలెవరు? అప్పులు ఎంత.? ఆస్తులు ఎంత అనే దానిపై తాజాగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే పరిశోధన సంస్థ వెల్లడించిన నివేదిక ఆసక్తిగా మారింది.

ఏపీ ప్రభుత్వంలో జగన్ తో కలిపి మొత్తం 25మంది మంత్రులున్నారు. వీరందరి సంపాదనపై లెక్కలు తీసిన సదురు సంస్థ మొత్తం కేబినెట్ లోనే అత్యంత ధనవంతుడైన మంత్రిగా జగన్ ను తేల్చింది. ఆయన ఆస్తుల విలువ రూ.510కోట్ల రూపాయలు అని నివేదికలో వెల్లడించింది. ఆ తరువాత స్థానాల్లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉండడం గమనార్హం. ఆయన ఆస్తుల విలువ రూ.130 కోట్లుగా ఉంది. ఇక మూడోస్థానంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి రూ.61 కోట్లతో ఉన్నారు.

ఇక జగన్ కేబినెట్ లోని మొత్తం 25మందిలో 88శాతం మంది కోటీశ్వరులే కావడం విశేషం. వీరి సగటు ఆస్తుల విలు రూ.35.25 కోట్లుగా ఉండడం విశేషం.

ఇక జగన్ కేబినెట్ లోని మంత్రుల అప్పుల లెక్కలను పరిశోధన సంస్థ వెల్లడించింది. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి రూ.20 కోట్ల అప్పులతో మొదటి స్థానంలో ఉన్నాడని తెలిపింది. ఇక పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శ్రీరంగనాథరాజుకు రూ.12కోట్ల అప్పులు.. ఆ తర్వాత మంత్రి అవంతి శ్రీనివాసరావుకు రూ.5 కోట్ల అప్పులున్నాయి. వారి అఫిడవిట్ ల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఈ లెక్కలను వివరించింది.

Loading...