Tuesday, April 23, 2024
- Advertisement -

చంద్రబాబు దోపిడీకి అడ్డుకట్ట వేసిన జగన్

- Advertisement -

హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో 1996లో స్థలాల ఖరీదు గజం వంద లేక నూటయాభై రూపాయలుగా ఉండేది. మొత్తం చెట్లు, పుట్టలు తప్ప అది నివాసయోగ్యం కాదు. అలాంటి సమయంలో చంద్రబాబు హైటెక్ సిటీని మాదాపూర్ లో నిర్మించాలని పధకం వేశారు. ఆ సమయంలో దేశంలో ఐటి రంగం పుంజుకుంటున్నది. హైదరాబాదులో ఖాళీస్థలాలు కారుచౌకగా లభిస్తాయని గ్రహించిన పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు హైద్రాబాద్ వైపు దృష్టి సారించాయి.

చంద్రబాబు తన బినామీలకు ఉప్పందించారు. ఆయనకు అత్యంత సన్నిహితులైన ఒక సినిమా నటుడితో పాటు మరికొందరు ఘరానా మనుషులు మాదాపూర్లో వందల ఎకరాల స్థలాన్ని చౌకధరలకు కొన్నారు. స్థలాల యజమానులకు అదే పెద్ద ధర అనిపించింది. నిజం చెప్పాలంటే చంద్రబాబు గురువు రామోజీరావుకు కూడా ఆ విషయం తెలియదు. ఆయన విజయవాడ రోడ్డులో పదహారు వందల ఎకరాలను కొనేశారు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే విజయవాడ వైపు డెవలప్ చేస్తారని ఊహించారు.

అప్పట్లో మీడియా మొత్తం చంద్రబాబు గుప్పెట్లో ఉన్నది. సోషల్ మీడియా అనేది లేదు. చంద్రబాబు హైటెక్ సిటీని పూర్తి చేసేలోగా చంద్రబాబు, ఆయన బినామీలు కొన్న స్థలాల ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయాయి. చంద్రబాబు బినామీగా చెప్పబడే ఒక నటుడు ఏకంగా నూట ఇరవై ఎకరాలు కొన్నారని గుసగుసలు వినిపించాయి. అప్పట్లో తెహల్కా సైట్ చంద్రబాబు రెండువేల కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నాడని ప్రకటించింది. ఆ సంపద అంతా మాదాపూర్ స్థలాల ఫలితమే.

మళ్ళీ అదే వ్యూహాన్ని అమరావతిలో అమలు చేసారు చంద్రబాబు. ఇప్పటికే ఉన్న పెద్ద నగరాల్లో ఏదో ఒకదానిని రాజధానిగా ప్రకటించి అక్కడ సచివాలయం, అసెంబ్లీ, రాజభవన్లు నిర్మిస్తే చాలు. అయిదారు వందల కోట్లతో రాజధాని సెట్ అవుతుంది. లేదంటే వెయ్యికోట్లు. అంతే తప్ప ఖాళీ ఖజానాతో, రెవెన్యూ లోటుతో లక్ష కోట్ల రాజధాని నిర్మాణమనే తెలివితక్కువ ఆలోచనలు పరమ శుంఠలకు, అవినీతిపరులకు మాత్రమే వస్తాయి. రాజధానులను నిర్మించడానికి ఇక్కడ రాచరికం లేదు.

వంశపారంపర్య పాలనాయుగం కాదు. చంద్రబాబుకు కావలసింది ప్రజలను దోపిడీ చెయ్యడం, పది తరాలకు సరిపడా వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను పోగెయ్యడం. అంతే! ఆ పధకం ప్రకారమే తన కులస్తులకు, అనుచరులకు, పార్టీ పోషకులకు ముందుగానే లీకులు ఇచ్చి కారుచౌకగా రైతుల భూములను కొనిపించాడు. గత ఐదేళ్లలో ఆవగింజంత కూడా అభివృద్ధి చెయ్యకుండా, కేవలం మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టడం వెనుక చంద్రబాబు అసమర్ధత కాదు… దోపిడీ బుద్ధే కారణం.

తన దోపిడీకి అడ్డుకట్ట పడిందనే ఆక్రోశం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు వేసిన ఎంగిలి మెతుకులు తినమరిగిన కొందరు జర్నలిస్టులు చంద్రబాబును మహామేధావిగా చిత్రించడంలో పోటీ పడ్డారు. ఆయన మేధస్సు అంతా దోపిడీ చెయ్యడంలోనే తప్ప ప్రజారంజక పాలనలో కాదు. అప్పట్లో రెండోసారి కూడా ఆయన అధికారంలోకి రావడంతో ఆయన దోపిడీ యథేచ్ఛగా సాగిపోయింది.

కానీ, ఈసారి జగన్ రూపంలో యమధర్మరాజు కనిపించడంతో, చంద్రబాబు అధికార ఆయుషు తీరిపోయింది. జగన్ విసిరిన యమపాశం చంద్రబాబు మెడకు బలంగా బిగుసుకుని పోయి అధికారం అంతమైంది. కేబినెట్ సబ్ కమిటీ చంద్రబాబు భూదోపిడీని వెలుగులోకి తెచ్చింది. వెలుగులోకి తెచ్చినంత మాత్రాన సరిపోదు. ప్రభుత్వంలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా, వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించి, అవినీతిపరులను కటకటాల వెనక్కు నెట్టాలి. లేదంటే, జగన్ పరువుకు భంగం వాటిల్లడం తధ్యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -