Wednesday, April 24, 2024
- Advertisement -

జగన్ మరో సంచలన నిర్ణయం

- Advertisement -

ఇసుక రవాణా..టీడీపీ నాయకులకు మంచి ఫలహారంగా.. దోపిడీకి ఆదాయ వనరుగా మారిందని గతంలో ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఆరోపణలు గుప్పించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక టీడీపీ ఇసుక దోపిడీని జగన్ ప్రభుత్వం బయటపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్నయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలకు దక్కిన ఇసుక రవాణా టెండర్లను రద్దు చేసింది. మొత్తం అన్నింటిని రద్దు చేస్తున్నట్టు గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లాల వారీగా ఇసుక టెండర్లను గమనించిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలకు మేలు చేసేందుకే ఇసుక తరలింపునకు అతి తక్కువ ధరను కోట్ చేశారని నిగ్గుతేల్చింది. జిల్లా ఒకే కాంట్రాక్టర్ ను టీడీపీ నియమించగా.. ఇది దోపిడీకి ఆస్కారం లభిస్తుందని జగన్ ప్రభుత్వం ఇసుకరవాణా టెండర్లను రద్దు చేసింది.

ఇక తాజాగా కిలోమీటర్ కు రూ.4.90 ధర నిర్ణయిస్తూ జగన్ ప్రభుత్వం ఇసుక రవాణా టెండర్లు నిర్వహించాలని ప్రకటన జారీ చేిసంది. జీపీఎస్ ఉన్న ట్రక్కు యజమానులకు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

కాగా ప్రభుత్వం టీడీపీ నేతల చేతుల్లో ఉన్న ఇసుక రవాణా టెండర్లను రద్దు చేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో భవన నిర్మాణాలు ఆగిపోయాయంటూ గగ్గోలు పెట్టి ఆందోళనలు చేయడానికి రెడీ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -