అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

3911
AP CM YS Jagan Comments on Acham Naidu Arrest
AP CM YS Jagan Comments on Acham Naidu Arrest

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు సరిగ్గా శుక్రవారం ఉదయం 6.50 గంటలకు ఆయన స్వగ్రామమైన నిమ్మాడలోని ఇంటికి వెళ్లి అరెస్టు సమాచారాన్ని తెలియజేశారు. 7.20 గంటల సమయంలో అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు. అచ్చెన్నాయుడిని విజయవాడ తరలించారు.

వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ అధికారులు సమర్పించిన రికార్డులను కోర్టు అధికారులు పరిశీలించారు. అనంతరం విచారణ నిమిత్తం మంగళగిరి ఏసీబీ న్యాయమూర్తి నివాసానికి తరలించారు. ఈఎస్‌ఐ స్కాంలో ఏ2గా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే అనారోగ్య కారణాల వలన ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అచ్చెన్నాయుడిని మొదట విజయవాడ జైలుకు తరలించిన పోలీసులు.. ఆ తరువాత జైలు అధికారుల అనుమతితో జీజీహెచ్‌కు తీసుకెళ్లారు.

అయితే సీఎం వైఎస్ జగన్ అచ్చాన్నాయుడు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైద్యం చేయించండి అని అదికాలను అదేసించిన్నట్టు సమాచారం. తొక్కుడులో కూడా జాలి చూపిస్తున్నా వైఎస్ జగన్ అని సోషల్ మీడియలో సెటైర్‍లు పేలితున్నాయి.

Loading...