దటీజ్ వైఎస్ జగన్

2153
AP CM YS Jagan expresses solidarity to Narayana family members in Diguvapalli
AP CM YS Jagan expresses solidarity to Narayana family members in Diguvapalli

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అందరి మన్ననలు అందుకున్నారు. తన వ్యక్తిగత సహాయకుడు హఠాన్మరణం సందర్భంగా సీఎం జగన్ వ్యవహరించిన తీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన వ్యక్తిగత సహాయకుడు దంపెట్ల నారాయణ యాదవ్ అనారోగ్యంతో మృతి వార్త తెలియగానే వైఎస్ జగన్ వెంటనే హైదరాబాద్ కు పయనమయ్యారు.

ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని వచ్చే శారు. నారాయణ స్వగ్రామమైన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలంలోని దిగువపల్లికి హుటాహుటిన వెళ్లి నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాల అండగా ఉంటానని నారాయణ కుటుంబ సభ్యులకు భరోసాయిచ్చారు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ఓదార్చారు.

తమ కుటుంబంతో మూడు దశాబ్దాల కుపైగా అనుబంధం కలిగిన నారాయణ మరణంపై సీఎం స్పందించిన తీరు సముచితంగా ఉందని జనం అంటున్నారు. తమ వెంట ఉన్నవాళ్ల పట్ల వైఎస్ కుటుంబం ఎంత ఆదరంగా ఉంటుందో తెలపడానికి తాజా ఉదంతం నిదర్శమని ప్రజలు అంటున్నారు. తండ్రి తగ్గ తనయుడు వైఎస్ జగన్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Loading...