Thursday, April 25, 2024
- Advertisement -

రివర్స్ టెండరింగ్ , పీపీఏ లపై పై మొదటిసారి స్పందించిన సీఎం వైఎస్ జగన్..

- Advertisement -

పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించిన రివర్స్ టెండర్ల మీద రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రివర్స్ టెండర్ల ద్వారా ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుందని వైసీపీ నేతలు చెబుతోంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ రివర్స్ టెండర్ల మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎస్ఎల్బీసీ సమావేశంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష, రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని, రూ.782 కోట్ల ప్రజాధనం ఆదా చేశామని వివరించారు. దేశంలో ఏరాష్ట్రంలోనూ ప్రాజెక్టుల విషయంలో న్యాయ సమీక్ష, రివర్స్ టెండరింగ్ విధానాలు లేవని చెప్పారు.రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. పారదర్శక విధానాల్లో జ్యుడిషియల్‌ ప్రివ్యూ అత్యుత్తమం అంటూ కొనియాడారు.

పీపీఏల విషయంలోకూడా విప్లవాత్మ విధానాలు అమలు చేస్తున్నట్లు జగన్ వెల్లడించారు. 13 నెలలుగా చెల్లింపులు లేవని స్పష్టం చేశారు. అధిక ధరకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. కరెంటు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని పారిశ్రామికవేత్తలు వెనకడుగు వేసే పరిస్థితి ఉందని, పరిశ్రమలకు ఇచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడా లేదని అన్నారు.విద్యుత్ రంగంలో పరిస్థితులను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -