Thursday, April 18, 2024
- Advertisement -

తండ్రి క‌ట్టిన క్యాంప్ ఆఫీస్‌లోకి సీఎంగా అడుగుపెట్టిన జ‌న‌నేత‌..

- Advertisement -

వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలా వ‌ల్ల వైఎస్ జ‌గ‌న్ వైఎస్ఆర్‌సీపీ పార్టీని స్థాపించారు. త‌ర్వాత అక్ర‌మాస్తుల‌కేసులో జ‌గ‌న్ జైలుకు వెల్లిన సంగ‌తి తెల‌సిందే. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొని త‌ను అనుకున్న‌ది సాధించాడు. రాష్ట్ర‌ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌నె త‌ప‌న‌, మొండిత‌న‌మే ఇప్పుడు ఏపీ సీఎంగా ప్ర‌జ‌లు ప‌ట్టంక‌ట్టారు. ఇటీ వ‌లె జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు సాధించి అఖండ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర్న‌ర్ న‌ర‌శింహ‌న్‌తో భేటీ అయ్యారు జ‌గ‌న్. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జగన్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం వైఎస్‌ఆర్‌సీపీ ఎల్పీ తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను కోరారు. చూడ‌టానికి సాదాసీదా స‌మావేశం రీతిలో ఉన్న‌ప్ప‌టికీ దీని వెనుక ప‌లు అంశాల‌ను గుర్తుకు చేస్తున్నారు

ఇద‌లా ఉంచితె గ‌తంలోకి వెల్తే….జ‌గ‌న్‌ను ఏరోడ్డులో అయితే అరెస్ట్ చేశారో అదే రోడ్డులో సీఎం హోదాలో అడుగుపెట్టారు. 10 ఏళ్ల తరువాత తన తండ్రి కట్టించిన క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి కొడుకు గా బయటకు వెళ్లి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి హోదా అదే క్యాంప్ ఆఫీస్ లో అడుగుపెడుతున్న జగన్…ప‌క్కనే ఉన్న దిల్ కుష గెస్ట్ హౌజ్ కు కొన్నేళ్ల కింద నిందితుడిగా వచ్చి అరెస్ట్ అయిన జగన్, ఇప్పుడు రాజ్ భవన్ కు సీఎంగా వచ్చాడు. ఏ రోడ్డు లో అయితే అరెస్ట్ అయ్యాడో అదే రోడ్డులో ముఖ్యమంత్రి గా అడుగిడాడు“ అంటూ ప‌లువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -