Friday, April 19, 2024
- Advertisement -

నెల‌రోజుల పాల‌న‌లో జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు..

- Advertisement -

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు సాధించ‌డంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాద్య‌త‌లు తీసుకున్నారు. నెల రోజుల్లోనే పెను మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్‌ జగన్‌, పాలనలో తనదైన ముద్ర వేసి స్వచ్ఛ పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ ని నడిపిస్తున్నారు. మేనిఫెస్టోను ప‌విత్ర గ్రంథంగా భావిస్తూ సుప‌రిపాల‌న‌కు తెర‌తీశారు. వైఎస్‌ జగన్‌ తన తొలి నెలరోజుల పాలనలో తనదైన ముద్రవేశారు. నెల రోజుల్లో జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాలు.

  1. అవ్వాతాతలు ఆశీస్సులు కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీసి నెల రోజులు పాలన సాగింది.
  2. బాక్సైడ్‌ తవ్వకాల రద్దు అనేది ప్రజా ఉద్యమాలను,ఆకాంక్షలను గౌరవించడం.
  3. గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయంతో గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు.
  4. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు కేటాయిస్తూ రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌న‌ని ప్ర‌క‌టించారు.
  5. అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రజావేదిక నుంచే ప్రారంభించారు.
  6. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించే పథకానికి రూపకల్పన చేయాలని నిర్ణయించారు.
  7. మంత్రులూ, ప్రతి కలెక్టర్‌, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మేనిఫెస్టో కాపీలు ఉండాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టో అమలుకు కట్టుబడ్డారు.
  8. మంత్రివర్గంలో 50 శాతం పదవులు ఆయా వర్గాలకు కేటాయించి తాను చేతల మనిషినని నిరూపించుకున్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు.
  9. చంద్రబాబు చేసినట్లు తాను రాజ్యాంగాన్ని అపహాస్యం చేయనని అసెంబ్లీలోనే ప్రకటించారు.
  10. ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తూ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములను చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
  11. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే విచారిస్తానని… రుజువైతే పదవుల నుంచి తక్షణమే తొలగిస్తానని తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు.
  12. రబీ సీజన్‌ నుంచే వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలు .పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500.. అందుకోసం రూ.13,125 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సన్నద్ధం.
  13. పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు రూ.3 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి . కౌలు రైతులకు గుర్తింపు కార్డులు.
  14. అవ్వాతాతల పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. యదాంతో కొత్తగా 5.50 లక్షల మందికి పింఛన్లు అందే అవకాశం
  15. డయాలసిస్‌ చేయించుకుంటున్న మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ నెలకు రూ.3,500 నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంపు.
  16. ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. రాష్ట్రంలో 42 వేల మందికి లబ్ధి.
  17. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు రూ.11,500కు పెంపు.. రాష్ట్రంలో 55 వేల మందికి ప్రయోజనం 18, పారిశుధ్య కార్మికుల జీతాలు ఏకంగా రూ.
  18. వేలకు పెంపు
  19. హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల జీతాలు సైతం పెంపు
  20. వ్యవసాయ రంగ స్థితిగతులపై అధ్యయనం చేసి రైతులకు దిశానిర్దేశం చేసేందుకు వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు
  21. ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీర్‌ . దాంతో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
  22. అక్టోబర్‌ 2 (గాంధీ జయంతి) నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు
  23. ప్రతి గ్రామ పంచాయతీలో పది మంది ఉద్యోగుల నియామకం .మొత్తం మీద రాష్ట్రంలో 13,060 గ్రామాల్లో 5.60 లక్షల మందికి ఉద్యోగాలు
  24. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌
  25. తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివించినా పేద తల్లులకు ఏడాదికి రూ.15 వేలు
  26. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్‌ విద్యకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపు
  27. అక్టోబరు 1 నాటికి మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా తొలగింపు
  28. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు
  29. రాష్ట్ర ప్రయోజనాల సాధనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వంతో సీఎం వైఎస్‌ జగన్‌ సత్సంబంధాలకు పెద్దపీట వేస్తున్నారు.
  30. గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో, కలిసి పనిచేయాలని నిర్ణయించడం.

నెల‌రోజుల్లో జ‌గన్ తీసుకున్న నిర్ణ‌యాల ప‌ట్ల రాష్ట్ర‌ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -