Saturday, April 20, 2024
- Advertisement -

న‌వ్యాంధ్ర‌లో ఉద్యోగాల జాత‌ర …

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ కీలక ప్రకటనలు చేశారు. న‌వ‌ర‌త్నాల్లో భాగంగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని హీమి ఇచ్చారు. రాజకీయాలు, పార్టీలు, కులాలు చూడకుండా.. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రావాలని చెప్పారు.

న‌వ‌ర‌త్నాల్లో భాగంగా ఆగస్టు 15 వచ్చే సరికి అక్షరాలా మన గ్రామాల్లోని యువతకు గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. అన్ని ప‌థ‌కాలు డోర్ డెలెవ‌రీ ద్వారా అందిస్తామ‌న్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై రెండో సంతకం చేశారు. గ్రామ వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున వేతనంగా చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పారు. సేవాభావం ఉన్న యువతీ యువకులను గ్రామ వాలంటీర్లుగా తీసుకుంటామని ప్రకటించారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని చెప్పారు.

ప్రభుత్వ పథకాలు ఎవరికీ అందకపోయినా.. పొరపాటునైనా లంచాలు తీసుకుంటున్నారని తెలిసినా, వివక్ష కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్‌ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం. విప్లవాత్మక, పారదర్శక పాలనకు నాంది పలుకుతాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

గాంధీ జయంతి అంటే అక్టోబర్ 2 నాటికి 1.62 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘రేపు పొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ కావాలన్నా మీ పిల్లలే అక్కడే పనిచేస్తారు. కాబట్టి మీరు సెక్రటేరియట్ లో అప్లికేషన్ పెట్టండి. మీరు దరఖాస్తు చేసిన 72 గంటల్లో పని అయిపోతుందని హామీ ఇస్తున్నాన‌న్నారు. లంచం, సిఫార్సులకు తావేలేకుండా అర్హులైన అందరికీ 72 గంటల్లో దరఖాస్తులు ఆమోదిస్తామ‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -