Thursday, March 28, 2024
- Advertisement -

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించ‌నున్న సీఎం వైఎస్ జ‌గ‌న్….

- Advertisement -

ఆర్థికంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జ‌గ‌న్ చ‌ర్య‌లు ప్రారంభించారు. మంచి ప‌రిపాల‌న దిశ‌గా అడుగులు వేస్తున్నారు. పాల‌న‌లో అవినీతి లేకుండా చేసేందుకు ముందుకు సాగుతున్నారు. అభివృద్దికి చేయూత‌నిచ్చే ఏ ఆదాయా విభాగాన్ని జ‌గ‌న్ వ‌దులుకొనే ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ లేడు. దానిలో భాగంగా కొన్ని ముఖ్య‌మైన‌ రాంగాల్లో అంబాసిడ‌ర్ల‌ను నియ‌మించేందుకు సీఎం నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటకం సహా రాష్ట్రంలోని అన్ని రంగాలకు అంబాసీడర్‌లను నియమించాలని ముఖ్యమంత్రికి కొందరు సలహా ఇచ్చారని తెలుస్తోంది. ప్ర‌ధానంగా ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధిచేసేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దానిలో బాగంగా పర్యాటకరంగానికి అంబాసిడ‌ర్‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను నియ‌మిస్తే బాగుంటుంద‌ని కొంద‌రు నేత‌లు జ‌గ‌న్‌కు సూచించారు.

ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న జూనియ‌ర్ సినిమాల‌పైనె దృష్టి సారించారు. ఇలాంటి స‌మ‌యంలో ఏపీ సీఎం తర్జనభర్జన పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, అతడిని సంప్రదించడం ఎలా..? ఒకవేళ అడిగినా తారక్ ఒప్పుకుంటాడా..? అన్న దానిపైనా పార్టీ అంతర్గత సమావేశంలో చర్చ జరిగినట్లు విశ్వసనీయస‌మాచారం. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రభుత్వానికి ఎటువంటి సహకారం అందించని తారక్.. దానిని ఓడించి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తారా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అయితే ఎన్టీఆర్ మామ నార్నె, స‌న్నిహితుడైన కొడాలి నాని ఒత్తిడి తెస్తే జూనియ‌ర్ ఒప్పుకునే అవకాశాలూ లేకపోలేదు అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -