లోక్ స‌భ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విపై స్పందించిన జ‌గ‌న్‌….

404
AP CM YS Jagan mohan reddy meet to Home Minister Amith Shaa
AP CM YS Jagan mohan reddy meet to Home Minister Amith Shaa

రేపు జ‌ర‌గ‌బోయె నీతీ అయోగ్‌లో జ‌గ‌న్ పాల్గొనే దానికి సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెల్లారు. అంత‌కంటె ముందే హోంమంత్రి అమీత్ షాతో భేటీ అయ్యారు. భేటీలో ప్ర‌ధానంగా ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రం సహకరించాలని కోరాం. విభజన హామీల అంశాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాం. ప్రత్యేక హోదా అంశంపై కూడా అమిత్ షాతో చర్చించాంమ‌న్నారు.

మ‌రో సారి ప్ర‌ధాని మోదీకి ప్ర‌త్యేక‌హోదా ఆవ‌క‌శ్య‌త‌గురించి చెప్పాల‌ని అమిత్ షాను కోరామ‌న్నారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతానని.. ఈ సందర్భంగా విభజనకు సంబంధించిన హామీల అమలు గురించి అడుగుతానన్నారు. డిప్యూటీ స్పీకర్‌ పదవిపై మాద‌గ్గ‌ర‌కు ఎలాంటి ప్ర‌తిపాద‌న రాలేద‌ని…జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.

Loading...