Friday, March 29, 2024
- Advertisement -

రాజధాని అమరావతిపై జగన్ రెఫరెండం?

- Advertisement -

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగి స్వతంత్రంగా ఉండాలని అనుకున్నప్పుడు క్లిష్ట సమస్యగా మారింది. ఇలా చేయడం ఇష్టంలేక ఇద్దరు ప్రధానులు మారిపోయారు. బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసి వైదొలిగారు.

యూరోపియన్ యూనియన్ లో ఉండడం ఆర్థిక వ్యవస్థకు గుదిబండగా బ్రిటన్ భావించింది. అక్కడ ఒకే కరెన్సీ, మారకం విలువ వల్ల బ్రిటన్ నష్టపోతుందని ఎగ్జిట్ కావాలని భావించింది. దీనికోసం ప్రజాభిప్రాయ సేకరణ చేసి పాలకులు సరైన నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి క్లిష్ట సమస్యలకు రెఫరెండమే వాడుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ సైతం ఈ సరికొత్త అస్త్రాన్ని ఏపీ రాజధాని అమరావతిపై ప్రయోగించబోతున్నట్టు సమాచారం.

ఏపీ రాజధాని అమరావతి సురక్షితం కాదంటూ ఇటీవల మంత్రి బొత్సా ప్రకటించడం.. దాన్ని టీడీపీ రచ్చ చేస్తున్న దృష్ట్యా ఆ పార్టీని ప్రజల్లోనే ఎండగట్టాలని జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఇందుకోసమే త్వరలోనే ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలా వద్దా అనే విషయంలో రెఫరెండం పెట్టడానికి జగన్ రెడి అయినట్లు సమాచారం.

ఈ దెబ్బతో టీడీపీ నోరు మూయడంతోపాటు ప్రజాభీష్టం మేరకు ఏపీకి రాజధానిని డిసైడ్ చేయవచ్చని జగన్ యోచిస్తున్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -