Friday, March 29, 2024
- Advertisement -

మొద‌టి సంత‌కం వైఎస్సార్ పెన్షన్ కానుక ఫెన్ష‌న్ ఫైల్ పైనే..

- Advertisement -

న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ రెండో సీఎంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టం ముగిసింది.విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు తండ్రి బాట‌లో న‌వ‌ర‌త్నాల్లో భాగంగా త‌న మొద‌టి సంత‌కం వైఎస్సార్ పెన్షన్ కానుక ఫెన్ష‌న్ ఫైల్ పెట్టారు.

నవరత్నాల్లో భాగంగా ప్రతీ అవ్వ, తాతలకు, వితంతువులైన అక్కచెల్లెమ్మలకు పెన్షన్ 3000కు పెంచుతామని ఇచ్చిన హీమీని నెర‌వేర్చారు. అవ్వా, తాత, అక్కాచెల్లెళ్ల ఆశీస్సులు కోరుతూ ముఖ్యమంత్రిగా తన తొలి సంతకాన్ని వైఎస్సార్‌ పెన్షన్‌ ఫైల్‌పై చేశారు. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, తొమ్మిదేళ్ల కష్టానికి ప్రతిగా ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతీ అక్కా, చెల్లె, అవ్వా తాత, సోదరుడు, స్నేహితుడు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

అవ్వాతాతల ఆశీస్సుల కోసం ముఖ్యమంత్రిగా మొదటి సంతకం వైఎస్సార్‌ పెన్షన్‌ ఫైల్‌పై చేస్తున్నాను. జూన్‌ నెల నుంచి రూ. 2250 అందిస్తాం. తర్వాత ఏడాది రూ. 2500, మరుసటి ఏడాది రూ. 2750..అనంతరం రూ. 3000 వేలు అందిస్తాం’ అని పేర్కొన్నారు. అనంతరం ఫైలుపై జగన్ సంతకం పెట్టారు. నవరత్నాల పథకాల ద్వారా కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ప‌రిపాల‌న ఉంటుంద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -