Thursday, April 25, 2024
- Advertisement -

సీఎం జ‌న‌గ్ స‌చివాల‌య ప్ర‌వేశానికి బ్రేక్‌..

- Advertisement -

నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన జగన్ అప్పుడే పరిపాలన షురూ చేశారు. ఎన్నిక మ్యానిఫెస్టో అమ‌లుకు శ్రీకారం చుట్టారు. దాంతో పాటు అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోనూ ప్ర‌క్షాళ‌న‌కు పూనుకున్నారు. ప‌లు ఉన్న‌తాధికారుల బ‌దిలీలు కూడా జ‌రిగిపోయాయి. న‌వ‌రత్నాల్లో భాగంగా వైఎస్ ఆర్ ఫెంన్ష‌న్ ప‌థ‌కాన్ని అముల‌చేస్తూ దానికి సంబంధించిన మొద‌టి జీవోను జ‌గ‌న్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

ఇక స‌చివాల‌యంలో అడుగు పెట్టాల‌నుకున్న జ‌గ‌న్ త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్న‌ట్ల స‌మాచారం. ఇవాలె శాఖ‌ల‌కు సంబంధించి సమీక్షలు నిర్వహించాలని అనుకున్నారు..కాని సుముహూర్తం లేకపోవడంతో ఆయన తన నిర్ణయాన్ని వాయిదావేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటివద్ద నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు.

ఇప్ప‌టికే కొత్త డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ జ‌గ‌న్‌ను ఆయ‌న నివాసంలో క‌లుసుకొని శాంతి భ‌ద్ర‌త‌ల‌పై చ‌ర్చించారు. రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మరికొందరు ఉన్నతాధికారులు కూడా జగన్ ను తాడేపల్లి నివాసంలోనే కలుసుకుని రాష్ట్ర స్థితిగతులపై నివేదికలు సమర్పిస్తారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇంటినుంచె పాల‌న సాగిస్తున్న జ‌గ‌న్ త్వ‌ర‌లో మంచి ముహూర్తం చూసుకొని స‌చిలాయంలో అడుగుపెట్ట‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -