తిరుమల వివాదం.. జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

312
AP CM YS Jagan Reaction on Tirumala Bus Ticket Controversy
AP CM YS Jagan Reaction on Tirumala Bus Ticket Controversy

ఏపీ సీఎంగా వచ్చాక తిరుమలలో అన్యమత ప్రచారంపై పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగడం.. ఇటీవల తిరుమల బస్ టికెట్లపై ఇతర మతాల ప్రచారం జరగడంతో కేంద్రంలోని బీజేపీ దీనిపై సీరియస్ అయ్యింది. జగన్ సర్కారుపై బీజేపీ దిగ్గజ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు కూడా పైర్ అయ్యారు. దీంతో జగన్ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగినట్టు అర్థమవుతోంది.

ఇక నుంచి తిరుమలలో హిందూయేతర మతాలకు చెందిన వారు తిరుమల ఆలయాల్లో ఉద్యోగులుగా, సిబ్బందిగా పనిచేయడానికి వీల్లేదని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు టీటీడీలో పనిచేసే ఉద్యోగులందరికీ జాతకాలను తనిఖీ చేయాలని జగన్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్టు సమాచారం.

అయితే ఉద్యోగాల ఎంపిక సమయంలో మెరిట్, మార్కులు, ప్రావీణ్యత ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇప్పుడు అన్యమతాల వారిని అని వారిని తొలగించడం.. వేరే చోటు కు పంపడం వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హిందూయేతరులు దీనిపై కోర్టులకు ఎక్కితే జగన్ సర్కారు ఇరుకునపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం అమలైతే చాలా మంది ఉద్యోగులు టీటీడీపీ వీడే చాన్స్ ఉంటుందంటున్నారు? ఇది జగన్ సర్కారు చిక్కులు తెచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఏపీ ప్రభుత్వం తీసిన లెక్క ప్రకారం టీటీడీలో 48మంది హిందూయేతర ఉద్యోగులున్నారని తేల్చారు. వీరు మతమార్పిడి చేసుకొని తిరుమలలో ఉద్యోగాలు చేస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ణారణకు వచ్చారు.

ఇలా ప్రక్షాలన చేసి తిరుమల ప్రాధాన్యాన్ని కాపాడాలని వైసీపీ డిసైడ్ అయ్యింది. ఇలా చేయడం వల్ల బీజేపీని, ఇతర ప్రతిపక్షాలను ఎదుర్కొనే చాన్స్ ఉంటుందని భావిస్తోంది. చూడాలి మరి జగన్ ప్లాన్లు ఎంత వరకు సక్సెస్ అవుతాయో..

Loading...