Friday, April 19, 2024
- Advertisement -

ఇక నుంచి ఆ మాఫియా ఎక్కడా ఉండకూడదు..అధికారులకు జగన్ ఆదేశాలు

- Advertisement -

రాష్ట్రంలో ఇసుక కొరతపై సీఎం జగన్ ఇవాలా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి నుంచి ఇసుక మాఫియా అనేది ఎక్కడా కనపడకూదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరదలు తగ్గాయని ఇసుక రీచ్ లను పెంచాలని అధికారులను జగన్ ఆదేశించారు.గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి పాలనాపరంగా కచ్చితమైన తేడా కనిపించాలంటూ అధికారులకు స్పష్టం చేశారు.

ఇసుక అమ్మకాలు ప్రారంభమైనా ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల ఇసుక పంపిణీలో ఆటంకాలు ఏర్పడటంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఇసుక రవాణా చేస్తామంటూ ఎవరు ముందుకు వచ్చినా వారికి అవకాశమివ్వాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లను తెరవాలని, జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని సూచించారు.

సుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని, ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని వెల్లడించారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదని..చెక్ పోస్టుల్లో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులకు జగన్ సూచించారు. ప్రతీ జిల్లాల్లోని 2 వేల మంది నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇసుక రవాణా వాహనాలను ఇప్పించి వారికే ఇసుక కాంట్రాక్టులు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -