కాల్ మనీ, సెక్స్ రాకెట్ ఉచ్చులో టీడీపీనేత‌లు… కొత్త‌ కేసు న‌మోదు…

1208
AP CM YS Jagan Serious comments On Call Money Sex Racket Scam
AP CM YS Jagan Serious comments On Call Money Sex Racket Scam

టీడీపీ హ‌యాంలో కాల్ మ‌నీ సెక్స్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. అప్ప‌ట్లో ఈ వ్య‌వ‌హ‌రాంపై పోలీసులు దృష్టిపెట్ట‌క‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. రెండో రోజు జ‌రిగిన క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌ద‌స్సులో సీఎం జ‌గ‌న్ ఈ విష‌యంపై దృష్టిసారించారు. ఈ కేసులో ప్ర‌ధానంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న మ‌రి కొంద‌రిపేర్లు వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

క‌లెక్ట‌ర్లు, ఎస్పీల స‌మావేశంలో ఈ కాల్ మ‌ని సెక్స్ రాకెట్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్య‌వ‌హారంపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు.

‘కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దు. పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలి. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణం. ఈ రాకెట్‌లో వైఎస్సార్‌సీపీ వాళ్లు ఉన్నా సరే ఉపేక్షించొద్ద‌ని అధికారుల‌ను జ‌గ‌న్ ఆదేశించారు.

ఇద‌లా ఉంటె ఇప్పుడు తాజాగా ఈ వ్వ‌వ‌హారం టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగియనుంది. ఇందులో టీడీపీ నేతల పాత్రపై విచారణ చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై విచారణ చేయాలని ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న చెన్నుపాటి శ్రీను, యలమంచిలి రాములుతో పాటు బుద్ధా వెంకన్న, బోండా ఉమాలను కూడా విచారణ చేయాలని, ఈ కేసును రీ వెరిఫై చేయాలని కోరారు. జ‌గ‌న్ ఇచ్చిన ఆదేశాల‌ను చూస్తె త్వ‌ర‌లోనె ఈకేసు స్పీడు అందుకోవ‌డం ఖాయం.

Loading...