Friday, April 19, 2024
- Advertisement -

రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

ఏపీకి 3 రాజధానులు అవసరం అంటూ సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన మంటలు ఇంకా ఆరడం లేదు. రాజధాని రైతుల ఆందోళన పేరిట టీడీపీ చేస్తున్న అంతా ఇంతా కాదు.. ఇక ఆయన పార్ట్ నర్ జనసేనాని పవన్ కళ్యాణ్ విదేశాల్లో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకొని వచ్చి అమరావతిలో చెలరేగిపోతున్నారు. రైతులతో కలిసి ఆందోళన చేస్తున్నారు.

అమరావతిపై మంత్రులు తర్వాత మాట్లాడారు కానీ సీఎం జగన్ మాత్రం స్పందించలేదు. తాజాగా శుక్రవారం ఏలూరులో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించి ఏర్పాటు చేసిన సభలో రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ మాట్లాడుతూ.. గతంలో అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్నారని.. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని.. అన్యాయాన్ని సరిదిద్దుతామంటూ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సర్కారు కొందరికే న్యాయం చేసిందని.. అన్నదమ్ముల్లా అనుబంధాలు నిలిచేలా తాము నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అందరి అభివృద్ధి కోసం వినియోగిస్తామని జగన్ స్పష్టం చేశారు.

దీన్ని బట్టి జగన్ విశాఖకు పరిపాలన రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని చేయడం ఖాయమన్న అంచనాకు విశ్లేషకులు వచ్చారు. అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో జగన్ చేసిన ఈ ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వం రాజధాని మార్చడం ఖాయమన్న సంగతి తేలిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -