Saturday, April 20, 2024
- Advertisement -

బాబుతో స‌మావేశ‌మ‌యిన సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం…

- Advertisement -

రేపు 14న ఏపీ కేబినేట్ ఉంటుందా ఉండ‌దా అన్న ఉత్కంఠ వీడ‌టంలేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈసీ నుంచి అనుమ‌తి రాక‌పోవ‌డంతో కేబినేట్ భేటీపై నీలినీడ‌లు క‌మ్మ‌కున్నాయి. ఇలా ఉంటె తాజాగా సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం బాబుతో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. రేపు కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రితో చర్చించారు.

ఈ నెల 14వ తేదీననిర్వహించతలపెట్టిన కేబినెట్ భేటీ‌కి సంబంధించి చ ర్చించే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న వివాదాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉండ‌టంతో కేబినేట్ అజెండాను ఎన్నిక‌ల సంఘానికి పంపారు. 48 గంట‌లు దాటిని అనుమ‌తి రాక‌పోవ‌డంతో ఉత్కంఠ‌నెల‌కొంది.

ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రస్తుతం సెలవులో ఉన్నారు.సెలవులకు వెళ్లే ముందు గోపాలకృష్ణ ద్వివేది ఈసీకి ఎజెండా కాపీని పంపారు. సోమవారం నాటికి కేంద్ర ఎన్నికల సంఘం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావించారు. సాయంత్రానికి ఈసీ నుంచి అనుమ‌తి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -