మరో నాలుగు మృతదేహాలు లభ్యం…..ఘటనా స్థలానికి బయల్దేరిన సీఎం జగన్

186
AP : Devipatnam boat capsize :Death toll mounts to 12
AP : Devipatnam boat capsize :Death toll mounts to 12

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర లాంచీ బోల్తా ఘటన పెను విషాదాన్ని నింపింది.ఈ ప్రమాదంలో గల్లంతైనవారిలో ఆదివారం సాయంత్రానికి 8 మృతదేహాలు రెస్క్యూ టీమ్‌లు వెలికి తీశారు. ఇప్పుడు మనో నాలుగు మృతదేహాలను వెలికితీశాయిరెస్క్యూ టీమ్‌లు .ఇందులో నెలల వయసున్న పసి పాప కూడా ఉండటం బాధిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్యం 12 కిచేరింది.

ఆదివారం 74 మందితో పర్యాటక బోటు పాపికొండల విహార యాత్రకు బయలు దేరిన సంగతి తెలిసిందే.అందులో 64 మంది పర్యాటకులు,9మంది సహాయక సిబ్బంది ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 26 మంది బయటపడ్డారు.39 మంది ఆచూకి గల్లైంతనట్లు అధికారులు తెలిపారు.

ఉదయం 9.25 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో సంఘటనా స్థలానికి బయల్దేరారు. లాంచీ బోల్తా పడిన కచ్చులూరు ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. తర్వాత రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

Loading...