కుటుంబంలో గొడవలే కారణా…? కోడెల గుండెపోటా…? ఆత్మహత్యా…?

287
AP Ex Speaker kodela commits suicide due to disputes in family
AP Ex Speaker kodela commits suicide due to disputes in family

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు హఠాన్మరణానికి కారణాలు ఏముంటానె అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కొంతకాలంగా తన కుటుంబం చుట్టూ ముసురుకున్న వివాదాల కారణంగా కోడెల శివప్రసాదరావు తీవ్ర మస్థాపానికి గురయ్యారు. అదే సమయంలో ఆయన గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం ఆస్పత్రిలో కూడా చేరారు. ఆరోపనలు,కేసులనుంచి బయట పడేందుకు ఆయన ప్రయత్నించినట్లు సమాచారం.

రెండు రోజుల క్రితం బీజేపీలో చేరేందుకు సైతం ఆయన ప్రయత్నాలు చేశారని… బీజేపీ నేతలు గరికపాటి, కంభంపాటితోనూ కోడెల చర్చలు జరిపారని వార్తలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా కుటుంబంలో గొడవలు జరగుతున్నట్లు సమాచారం. కుమారుడితో ఆయన తీవ్రంగా గొడవపడ్డారని… ఈ పరిణామాలు కూడా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.

ఆయన మరణం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఆయన గుండె పోటుకు గురి అయినట్టుగా ఒక ప్రముఖ మీడియా సంస్థ వార్తా కథనాన్ని ఇవ్వగా…. మరో క టీవీ చానల్ ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా వార్తలను ప్రసారం చేస్తోంది. రెండు మీడియా సంస్థలు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత అనుకూలమైనవి.

ఆరెండు చాలనల్లోనె కోడెల కు ఏమైందనే అంశం గురించి భిన్నమైన కథనాలు వస్తూ ఉండటం గమనార్హం. రెండు రోజుల కిందట కోడెల శివప్రసాద్ రావు హైదరాబాద్ వెళ్లారని, అక్కడ సొంతిట్లో ఉన్నారని ఆయన ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యారని ఒక మీడియా సంస్థ పేర్కొంది. ఆయన ఆత్మహత్యాయత్నం చేశారని, ఆయన ఇంట్లోనే ఉరి వేసుకున్నారని మరో మీడియా సంస్థ చెబుతోంది. ఆయన మరణంపై, ఎలా మరణించారనే అంశంపై అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.

Loading...