Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీలో మరో చరిత్రాత్మక నిర్ణయం…

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో అవినీతిని అంతం చేస్తానని చెప్పిన జగన్ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో అన్ని టెండర్లల్లోను అధికార దుర్వినయోగం జరిగిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాత్రం అలాంటి వాటికి తావివ్వకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవినీతి అనేది ఎక్కడా కనిపించవద్దని ఇప్పటికే జగన్ అధికారులకు సూచించారు.

జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనె అనేక సంలచన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రూ.100 కోట్లు దాటిన ప్రాజెక్టులన్నీ ఇకపై న్యాయసమీక్ష తర్వాతే ముందుకు వెళ్లనున్నాయి.దీని కోసం హైకోర్టు జడ్జి జస్టిస్ బి.శివ శంకర్ రావు నియమితులైనట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో సవివరంగా చర్చించిన ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

గత టీడీపీ హయాంలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను అస్మదీయులకు ఎక్కువ ధరకు కట్టబెట్టారని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే తాము జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తామన్నారు. అందుకు తగ్గట్టే అసెంబ్లీలో చట్టం చేశారు.జస్టిస్ శివ శంకర్ రావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -