రాజధానిపై జగన్ సంచలన నిర్ణయం…ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు..

311
AP Governement forms expert new committee on Captail amaravathi
AP Governement forms expert new committee on Captail amaravathi

గత కొద్దిరోజులుగా అమరావతి రాజధానిపై రాజకీయాలు రంజుగా నడుస్తున్నాయి. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. బొత్సచేసిన వ్యాఖ్యలతో జధానిని దోనకొండకు మారుస్తున్నారంటూ టీడీపీ నానా హంగామా చేసింది.ఇప్పుడు రాజధానిపై జగన్ ఏ నిర్ణయం తీసుుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ జగన్ పై ఎన్ని విమర్శలు చేసినా స్పందించలేదు. దీన్ని ఇలాగె కొనసాగిస్తే రాజకీయ గందరగోలం ఏర్పడుతుందనె ఉద్దేశ్యంతో అమరావతిపై తేల్చేందుకు సిద్దం అయ్యారు జగన్.

తాజాగా రాజధాని నిర్మానంపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అమరావతి విషయమై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది. ఈ కమిటీ అమరావతితో సహా రాష్ట్రంలోని పట్టణాల పురోగతిపై ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ కన్వినర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎస్ రావును నియమించింది. సభ్యులుగా ప్రొఫెసర్ మహవీర్, డాక్టర్ అంజలీమోహన్, డాక్టర్ శివానందరెడ్డి, ప్రొఫెసర్ కేటీ రవిచంద్రన్, ప్రొఫెసర్ అరుణాచలం పని చేయనున్నారు.

అసలు అమరావతి విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసులో ఏముంది? ఆయన మన్ కీ బాత్ ఏంటి? రాజధానిని అమరావతి నుంచి మారుస్తారా? లేకపోతే కేవలం పరిపాలన నిర్మాణాల వరకే పరిమితం చేస్తా? అప్పుడు రైతులకు పరిహారం ఎలా ఇస్తారనే పలు సందేహాలు వచ్చాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కమిటి ఎలాంటి నివేదిక ఇస్తుందో చూడాలి.

Loading...