Thursday, March 28, 2024
- Advertisement -

ప్రత్యేక హోదా ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసిన ప్రభుత్వం..

- Advertisement -

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నమోదయిన కేసులను కొట్టి వేయాలంటూ హోంశాఖ సర్య్కులర్ జారీ చేసింది. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు కేసుల విత్ డ్రా పిటిషన్లు ఫైల్ చేయాల్సిందిగా సూచించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా హైదరాబాద్ ఆదాయాన్ని కోల్పోతున్న 13 జిల్లాల నవ్యాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. దానికి రాజ్యసభలో భాజాపా కూడా మద్దతు తెలిపింది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని బదులు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై కేంద్రంపై పోరాడకుండా ప్యాకేజికి ఒప్పుకుంది.

అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పెద్ద ఎత్తున హోదా కోసం నిరసనలు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసింది. ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అధికారంలోకి వస్తే కేసులను ఎత్తి వేస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అనుకున్నట్లు గానె వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చించి. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలని క్యాబినేట్ తీర్మానించింది. దానిలో భాగంగానె ఇప్పుడు ఆ కేసులు అన్నీ ఉపసంహరించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -