Wednesday, April 24, 2024
- Advertisement -

బాబు జమానా….. ఖజానా ఖల్లాస్…. జీతాలకూ దిక్కులేదా?

- Advertisement -

శభాష్……చంద్రబాబు మరోసారి తనను తాను గొప్పగా నిరూపించుకున్నారు. 2004కు ముందు కూడా ఇదే పరిస్థితి. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి అప్పటి సమైక్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడు. కానీ ప్రచార ఆర్భాటంతో అన్నీ అద్భుతం అనిపించాడు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జమానాలో ఆర్థిక స్థితి మెరుగుపడి బడ్జెట్ లక్ష కోట్లకు చేరుకోగానే….అంతా నేను వేసిన పునాదుల పుణ్యమే, నా ప్రతిభే అని చెప్పుకొని మరోసారి ప్రచారంతో ఎంతో కొంత క్రెడిట్ కొట్టేశాడు బాబు.

అప్పులు చేయడంలో కూడా బాబు అగ్రగణ్యుడే. 2004కు ముందు కూడా అంతకుముందు ఏ ముఖ్యమంత్రీ చేయనంత స్థాయిలో అప్పుల భారం పెంచాడు. ఇప్పుడు నాలుగేళ్ళలో రెండు లక్షల కోట్లకు అప్పుల భారాన్ని పెంచేశాడు. అలాగే కనీసం దుర్గ గుడి ఫ్లై ఓవర్‌ని కూడా పూర్తి చేయలేకపోయాడు బాబు. అదే వైఎస్ హయాంలో ఏకంగా అవుటర్ రింగ్ రోడ్డునే నాలుగేళ్ళలో పూర్తి చేసేశారు. ఇక రీసెంట్‌గానే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ని రెండు లక్షల కోట్లు అని గొప్పగా ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు అసలు స్థితి ఏంటో బయపెట్టాడు. మార్చి నెల జీతాలు ఇంకా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు అందలేదు. అదేంటంటే కేంద్రం నుంచి నిధులు రావడం లేదు అని సమాధానం చెప్తున్నారట. అదీ బాబుగారి సత్తా. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో 2004కు ముందు బాబు పాలనను దగ్గర నుండి చూసిన సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ‘శభాష్….చంద్రబాబు మరోసారి తన పాలనా ప్రతిభ నిరూపించుకున్నాడు….అప్పట్లో సమైక్యాంధ్ర ప్రదేశ్‌ని జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి తీసుకెళ్ళినట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అథోగతి పాలు చేశాడు’ అని ఆవేదనతో వ్యాఖ్యలు చేస్తన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేదు. జీతాలు ఇవ్వలేని ఘోరమైన స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు తీసుకెళ్ళాడన్నది ఆన్ రికార్డెడ్‌గా కనిపిస్తున్న నిజం. ఇక ఈ చేతకాని తనాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకుంటాడో చూడాలి. మోడీ నిధులు ఇవ్వడం లేదు అంటాడో? లేక అంతా జగన్ వళ్ళే…..దీని వెనుక జగన్ కుట్ర ఉంది అని విమర్శలతో విరుచుకుపడతాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -