Friday, March 29, 2024
- Advertisement -

వైఎస్‌లపై చంద్రబాబు రాజకీయ కక్ష్య….. జగన్ ప్రాణాలకూ రక్షణ లేదా?

- Advertisement -

వైఎస్‌లపై చంద్రబాబుకు ఏ స్థాయిలో కోపం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చంద్రబాబుతో సహా పచ్చ బ్యాచ్ నాయకులు, పచ్చ మీడియా మొత్తం కూడా వైఎస్‌లు మనుషులే కాదు అని ప్రచారం చేయడానికీ వెనుకాడలేదు. ఆల్రెడీ వైఎస్ రాజశేఖరరెడ్డిది హత్యే అన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చే నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నాడు. 2019 ఎన్నికలు ఏడాదిలోనే ఉన్న నేపథ్యంలో అనుక్షణం జనంతో, జనాల మధ్య ఉండాల్సిన పరిస్థితి జగన్‌ది. ప్రజా సంకల్పయాత్ర పేరుతో ప్రజల మధ్యనే ఉంటున్నాడు జగన్. ఇప్పటికే జగన్‌కి ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎన్నో విమర్శలు ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా చంద్రబాబు ప్రభుత్వం అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న సుధాకరరెడ్డిని సత్ర్పవర్తన పేరుతో విడుదల చేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వం. వైఎస్‌ల కుటుంబంపై కక్ష్యసాధింపులో భాగంగానే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నాడన్న విమర్శలు వస్తున్నాయి. అనుక్షణం ప్రజల మధ్య ఉంటున్న జగన్‌పై రేపు హత్యా ప్రయత్నం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కునే ధైర్యంలేక ఇలాంటి దారుణమైన రాజకీయాలకు తెగిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్‌ రాజశేఖరరెడ్డిది హత్యే అని…..ఆ హత్యలో కొందరు ముఖ్యనేతల భాగస్వామ్యం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజారెడ్డి హత్యకేసులో శిక్షను అనుభవిస్తున్న సుధాకరరెడ్డిని విడుదల చేయడం ద్వారా జగన్ ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చేలాంటి నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ప్రతిపక్ష నాయకుడి ప్రాణాలకు ముప్పుతెచ్చే స్థాయి నిర్ణయాలు తీసుకోవడం, కక్ష్యసాధింపు రాజకీయాలు చేయడం చంద్రబాబు స్థాయికి తగదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -