Saturday, April 20, 2024
- Advertisement -

ఇప్పట్టి వరకు రివ‌ర్స్ టెండ‌రింగ్‌ ద్వారా ప్రభుత్వ ఆదా ఎంతో తెలుసా..?

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత ప‌లు మార్పుల‌కు శ్రీకారం చుడుతున్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టుల విష‌యంలో కూడా రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది.

దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. కాంట్రాక్టు విలువ కంటే అత్యంత తక్కువ ధరకు టెండర్ ఖరారయ్యే అవకాశం ఉందని దీనివల్ల పెద్ద మొత్తంలో నిధులు ఆదా అవుతాయని జలవనరులశాఖ ఉన్నతాధికారులు భావించారు. వీరు భావించిన విదంగానే సత్ఫలితాలను ఇస్తోంది.

వైఎస్ జగన్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప్పట్టిన రివ‌ర్స్ టెండ‌రింగ్‌ ద్వారా ఇప్పట్టి వరకు ప్రభుత్వం ఆదా చేసిన మొత్తం 1773.16 కోట్లు.

  1. పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం -782.80 కోట్లు.
  2. లెఫ్ట్‌ కనెక్టివిటీ (65వ ప్యాకేజీ ) పనులకు- 58.53 కోట్లు
  3. జెన్ కో బొగ్గు రవాణా – 186 కోట్లు.
  4. వెలిగొండ రెండో టన్నెల్‌ మిగిలిన పనులకు -61.76 కోట్లు
  5. డెస్క్ టాప్ కంప్యూటర్లు, ప్రింటర్లు UPS లలో – 65 .47 కోట్లు.
  6. జెన్ కో బొగ్గు పర్యవేక్షణ -25 కోట్లు.
  7. 4G సిమ్ కార్డులు పోస్ట్ పెయిడ్ 33.77 కోట్లు.
  8. పోతురాజు నాలా డ్రైన్ అభివృద్ధి 15.62 కోట్లు.
  9. ఇళ్లలో రివర్స్‌టెండరింగ్‌ రూ.105.91కోట్లు ఆదా.
  10. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల కోసం స్మార్ట్‌ ఫోన్లు కొనుగోలుకు సంబంధించిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.83.80 కోట్ల ప్రజా ధనం ఆదా.
  11. అల్లూరుపాడు ప్రాజెక్ట్ పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా 67.81 కోట్లు ఆదా.
  12. ఏపీ టిడ్కో రెండో ద‌శ రివ‌ర్స్ టెండ‌రింగ్‌లోనూ రూ.46.03 కోట్లు ఆదా.
  13. 503 కోట్ల సోమశిల ప్రాజెక్ట్ లో రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అయిన మొత్తం 67.9 కోట్లు.
  14. 391.13 కోట్ల గాలేరు–నగరి రెండో దశ తొలి ప్యాకేజీలో రూ.35.3 కోట్లు ఆదా.
  15. 942.90 కోట్ల ఏపీ టిడ్కో మూడో దశలో రివర్స్ టెండరింగ్ ద్వారా 103.89 కోట్ల ప్రజాధనం ఆదా.
  16. 343.97 కోట్ల గాలేరు – నగరి రెండో దశ రెండో ప్యాకేజీలో రూ.33.57 కోట్లు ఆదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -