Saturday, April 20, 2024
- Advertisement -

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ మొదటి అడుగు…

- Advertisement -

పెట్టుబడులను ఆకర్షించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తోలు ఏడాదే ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలో పాలన గాడిన పడటంతో పెట్టుబుడులపై ఫోకస్ పెట్టింది. దేశంలో నే అతిపెద్ద తీర్సప్రాంతం కలిగిన ఏపీ అభివృద్ధి పై 25 దేశాల ప్రతినిధులతో సదస్సు ను ప్రభుత్వం నిర్వహించనుంది. పారిశ్రామిక వేత్తలతోనే కాకుండా 35 దేశాల రాయబారులు, దేశీ పారిశ్రామిక రంగ ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు.

ఏపీలో పెట్టుబడుల సదస్సు… ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేవి మింగను మెతుకు లేకున్నా కోటు వేసుకుంటే ఒప్పందాలు చేసుకుని టిడిపి ప్రభుత్వం అబాసుపాలైంది. చివరకు ఒప్పందాలు చేసుకున్న వాటిలో సగం కూడా గ్రౌండ్ కాకుండా నే లక్షల కోట్ల ఒప్పందాల తో లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ చేసిన అతి ప్రచారంతో ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమిపాలయ్యింది.

ఈ నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా వాస్తవంగా పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ఏమిటి ? వాటి ద్వారా ఇరువురికి లాభం ఉంటుందా లేదా ఇత్యాది విషయాలు చర్చించడానికి జగన్ సర్కార్ ఓ విన్నూత ప్రయత్నం చేస్తోంది.ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 25 దేశాల రాయబారులు, హై కమిషనర్లు, దౌత్యవేత్తలు, పారిశ్రామిక సంస్ధల ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ ఆగస్టు 9న సమావేశం కాబోతున్నారు. విజయవాడ గేట్ వే హోటల్లో అత్యంత నిరాండంబరంగా నిర్వహించే ఈ సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రసంగిస్తారు. అనంతరం ప్రతినిధులతో విడివిడిగా జగన్ సమావేశమవుతారు. వారికి పక్కా కార్పోరేట్ పద్ధతిలో చర్చలు సాగిస్తారు. దేశంలో రెండో అతిపెద్ద తీర ప్రాంతం కలిగిన రాష్ట్రంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయో వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో వారికి జగన్ వివరించనున్నారు.

ఈ సదస్సులో ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాలే పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, పోలండ్, నెదర్లాండ్స్, థాయ్ లాండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, కొరియా, రొమేననియా, బల్గేరియా, కిర్జిజ్, తుర్క్‌మెనిస్ధాన్, ఈజిప్ట్ తో పాటు మొత్తం 25 దేశాలు ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనేందుకు అంగీకారం తెలిపాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మన దేశం కూడా వివిధ రంగాల్లో చేయుతను ఇచ్చింది. ఇప్పుడు ఆయా దేశాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించాలన్న జగన్ నిర్ణయం కూడా ఆసక్తి రేపుతోంది.

ఈ సదస్సుకు హాజరవుతున్న దేశాల్లో భారత ఉపఖండానికి చెందిన బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు కూడా ఉన్నాయి. ఇవన్నీ అభివృద్ధిలో ముందంజ వేసేందుకు ఎదురు చూస్తున్న దేశాలే. వీటి నుంచి పెట్టుబడుల రాక ఎలా ఉంటుందన్న అంశాన్ని పక్కనబెడితే తీర ప్రాంతం అదికంగా ఉన్న దేశాలుగా వీటికి పేరుంది. దీంతో తీర ప్రాంత రవాణాతో పాటు ఇతర అనుబంధ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తొలి దశలో ఆయా దేశాల అధికారిక ప్రతినిధులతో చర్చల తర్వాత రెండో దశలో పెట్టబడిదారులతో సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

ఆగస్టు 9వ తేదీన సదస్సు ప్రారంభమవుతుందని ప్రకటించిన ప్రభుత్వం ఎన్ని రోజులు నిర్వహిస్తారో పేర్కొనలేదు.
దీంతో చర్చలు ఫలప్రదంగా సాగే అంశం ఆధారంగా సదస్సును పొడిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.సీఐఐ సమ్మెట్ లపేరుతో సదస్సును కార్పొరేట్ తరహాలో చంద్రబాబు ప్రభుత్వం నిర్వహిస్తే జగన్ సర్కార్ నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించి వేదికను సైతం విశాఖ బదులు విజయవాడను ఎంచుకుంది. పాలనలో పారదర్శకత పాటిస్తామన్న సీఎం జగన్ ఎంఓయు లు…వాటి వల్ల లభించే ఉపాధి పై వాస్తవ వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -