Thursday, April 25, 2024
- Advertisement -

తిరుమల వివాదం.. రచ్చ చేయడానికి బీజేపీ రెడీ

- Advertisement -

తిరుమల.. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం. అంతటి అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంలో అన్యమత ప్రచారం చేయడం నేరం.. కఠిన శిక్షలు విధిస్తారు. అయితే తాజాగా అధికారులే ఇలా అన్యమత ప్రచారం చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.

తిరుమల టు తిరుపతి నడిచే వేలాది ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు ఇచ్చే టికెట్లపై అన్యమత ప్రచార ప్రకటనలు ఉండడం చూసి భక్తులు విస్తుపోయారు. ఈ ఉదయం నుంచి ఆర్టీసీ టికెట్ల వెనుక హజ్, జేరుసలెం యాత్రల ప్రకటనలు ముద్రించి ఉన్న టికెట్లను ఆర్టీసీ అధికారులు తిరుమల భక్తులకు ఇవ్వడం చూసి వారంతా అవాక్కయ్యారు.

దీనిపై స్థానికులు నిలదీసే సరికి డిపో మేనేజర్ వివరణ ఇచ్చారు. ప్రకటనలు ఉన్న ఐదు పేపర్లు పొరపాటున తిరుమలకు వచ్చాయని.. దీన్ని సరిదిద్దుకుంటామన్నారు. తిరుమలకు వచ్చే టికెట్ వెనుకాల ఎటువంటి ప్రకటనలు ఉండవని.. ఇక నుంచి అలానే చూసుకుంటామని చెప్పారు.

ఇక వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి వ్యవహారం జరగడంతో ఏపీ , తెలంగాణ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వమే ఓ మతాన్ని ప్రచారం చేయడానికి ప్రోత్సహిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. టీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే క్రైస్తవుల ప్రచారం హిందూ పుణ్యక్షేత్రాల్లో చేయడం ఏపీ సీఎం జగన్ కుట్ర అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే పొరపాటున జరిగిందని డిపో మేనేజర్ వివరణ ఇచ్చినా దీన్ని ప్రభుత్వానికి అంటగట్టి బీజేపీ రాజకీయం చేస్తుడడం హాట్ టాపిక్ గా మారింది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -