స్కూల్ తెరుచుకోవడం పై సీఎం జగన్ సంచలన నిర్ణయం..?

672
AP govt. postpones reopening of schools to November 2
AP govt. postpones reopening of schools to November 2

ఏపీ లో కరోనా తగ్గుదల నేపథ్యంలో ఇప్పటికే సీఎం జగన్ చాలా సడలింపులు ఇచ్చి ప్రజలను జాగ్రత్తగా పనులు చేసుకోమని చెప్పేశాడు.. అయితే విద్యార్థుల విషయం ఎటు తేల్చలేదు.. తాజాగా స్కూల్స్ తెరవడంపై సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఏపీలో అక్టోబరు 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.

స్కూళ్లను నవంబరులో ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. కరోనా పరిస్థితులు ఇప్పటికీ సద్దుమణగకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు. తాజా నిర్ణయం ప్రకారం నవంబరు 2న స్కూళ్లు తెరుచుకుంటాయి.

ఇక, పాఠశాలల ప్రారంభంతో సంబంధం లేకుండా జగనన్న విద్యాకానుక పథకాన్ని మాత్రం అక్టోబరు 5న ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు జగనన్న విద్యా కిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కానుకలో భాగంగా పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర స్టేషనరీ వస్తువులతో కూడిన ఓ కిట్ బ్యాగ్ ను విద్యార్థులకు అందిస్తారు.

Loading...