డాక్టర్లకు హైబీపీ తెప్పిస్తున్న జగన్ నిర్ణయం…ఇప్పుడెట్లా…?

322
AP Health expert Sujatha Rao committee submits report to cm ys jagan
AP Health expert Sujatha Rao committee submits report to cm ys jagan

వైద్య,ఆరోగ్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ రంగంలో ఎలాంటి సంస్కరణలు అమలు చేయాలో సుజాతరావు కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కమిటీ తన నివేదికను జగన్ కు అందించింది. నివేదికలో సుమారు 100 సూచనలు చేసింది.

కమిటీ సూచనలలో ప్రధానంగా ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేయడం నిషేధించింది.ఈ మేరకు ఆరోగ్య రంగంలో సుజాతరావు కమిటీ చేసిన సిఫారసులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.సిఫారసుల ఆధారంగా రూ. 1000 ఖర్చు దాటే ప్రతి వ్యాధికి ఆరోగ్యశ్రీలో చికిత్స అందించాలని నిర్ణయించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలోని 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేశారు.

ప్రభుత్వ వైద్యులకు జీతాలు పెంచాలన్న కమిటీ ప్రతిపాదనలకు జగన్ ఆమోదించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. ఆ సేవలు నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం కానుంది.

జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టును పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేయనున్నారు. 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకురానున్నారు. మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తున్నారు. ఏప్రిల్‌ 1, 2020 నుంచి జిల్లాల వారీగా అమలు కానుంది.

Loading...