Wednesday, April 24, 2024
- Advertisement -

మేఘా శక్తియుక్తులన్ని పోలవరం ప్రాజెక్టుపైనే

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ వరదాయినిగా పేరుగాంచిన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనుకూలమైన వాతావరణం నెలకొనడంతో నిర్మాణపనులు చేపట్టిన మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ తన శక్తియుక్తులను పోలవరం ప్రాజెక్టుపై కేంద్రీకరించింది. ఉన్నతస్థాయిలో నిత్యం పర్యవేక్షిస్తూ పనులు ముందుకు తీసుకెళ్తోంది. రాజకీయాలు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వకుండా రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చే రీతిలో ఇంజినీరింగ్‌ నైపుణ్యం, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అటు చివర ఉన్న అనంతపురం జిల్లా, ఈ చివర ఉన్న శ్రీకాకుళం జిల్లా వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని నదీ పరివాహక ప్రాంతాలకు అదనపు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టు కాబట్టి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ వరదాయిని అయింది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదం కారణంగా నిలిచిన పోయిన నీటిని దాదాపు 100 పంపులు పెట్టి తోడాల్సి వచ్చింది. మొత్తం 2.8 టీఎంసీల నీటిని పంపులతో తోడింది ఎంఈఐఎల్‌. తోడింది. ఈ డీవాటరింగ్‌ ప్రక్రియ 64 రోజుల పాటు సాగింది. ఇంజినీరింగ్‌పరంగా గతంలో జరిగిన లోపాలు, పొరపాట్లు సవరిస్తూ పూర్తి శాస్త్రీయ విధానంలో ఇంజినీరింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా పనులను ఎంఈఐఎల్‌ చేపడుతోంది.

నిర్దేశించిన గడువుకంటే ముందుగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తుందని పేరుతెచ్చుకున్న ఎంఈఐఎల్‌, పోలవరం ప్రాజెక్టు పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనుల్లో వేగం పెంచేందుకు ఇది అనుకూలమైన సమయం కావడంతో దానిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ తన శక్తియుక్తులు అనుభవాన్ని ఈ ప్రాజెక్టుపై కేంద్రీకరించింది. పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయడం ద్వారా మరోసారి తన సామర్ధ్యాన్ని చాటిచెప్పేందుకు సిద్ధంగా ఉంది.

పోలవరం స్పిల్ వేకు సంబంధించి కాంక్రీట్ పనులు జనవరిలో 20631 క్యూబిక్ మీటర్లు, ఫిబ్రవరిలో 32,124 క్యూబిక్ మీటర్లు, మార్చిలో ఇప్పటి వరకు 21358 క్యూబిక్ మీటర్లు పూర్తి చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు 79947 క్యూబిక్ మీటర్ల పనిని ఎంఈఐఎల్ పూర్తి చేసింది. ప్రాజెక్టు నిర్మిస్తున్న ప్రాంతంలో మట్టి పట్టిష్టతను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించుకుంటూ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి కొండ తవ్వకం పనులను వేగవంతం చేసింది.

స్పిల్ వే పనులతో పాటు వంతెనలు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్ వాల్ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జలవిద్యుత్ కేంద్రం పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.

ప్రాజెక్టు నిర్మాణాన్ని లక్ష్యం మేరకు పూర్తి చేయాలంటే శాస్త్రీయ పద్ధతిలో డిజైన్లు రూపొందించడం, వాటికి అనుమతులు పొందడం చాలా ముఖ్యం. డిజైన్లకు ఆమోదం లభించకపోతే పనులు వేగవంతం కావు. గత నెల పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి డిజైన్ల విషయాన్ని ఎంఐఈఎల్ తీసుకెళ్లింది. డిజైన్ అనుమతులు త్వరితగతిన వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. అలా జరిగిన పక్షంలోనే విధించిన గడువులోపు ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని వివరించింది. ఈ క్రమంలో డిజైన్ల అనుమతుల వ్యవహారం చూసేందుకు ఢిల్లీ, హైదరాబాద్ లో ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు సీఎం ప్రకటించారు.

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన అనుమతులు వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చాయి. ఆయన పాలనలోనే కుడి-ఎడమ కాలువలు పూర్తయ్యాయి. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. 2010 నుంచి 2019 వరకు స్పిల్ వేలో కొంత భాగం, డయాఫ్రామ్ వాల్, కాఫర్ డ్యామ్ నిర్మాణం మాత్రమే జరిగింది. ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని పనులకు ఇంజినీరింగ్ పరంగా సమప్రాధాన్యత ఇవ్వాలి. కాని, గత ప్రభుత్వం స్పిల్ వే పనులు, కాఫర్ డ్యామ్కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. అయినప్పటికీ వాటిని కూడా సకాలంలో పూర్తిచేయలేకపోయింది. ప్రాజెక్టుకు సంబంధించి చాలా పనులను గత ప్రభుత్వం ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. జలవిద్యుత్ కేంద్రంలో పిడికెడు మట్టి కూడా తీయలేదంటే అర్థం చేసుకోవచ్చు పోలవరానికి గత ప్రభుత్వం ఎంత ప్రయారిటీ ఇచ్చిందో.

ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం 45 డిజైన్లు ఉండగా వాటిలో ముప్ఫైఏడింటికి అనుమతి సాధించేందుకు దాదాపు పదేళ్లు పట్టింది. ఈ పరిస్థితుల్లో మార్చి 8న హైదరాబాద్లో భేటీ అయిన ప్రాజెక్టు డిజైన్ కమిటీ మిగిలిన 8 డిజైన్లకు సంబంధించి దాదాపు ఓ నిర్ణయానికి వచ్చింది. అనుకూలమైన వాతవరణం నెలకొనడం, అనుమతులపరంగా జాప్యం తొలగిపోనుండటంతో పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయంకన్నా ముందే పూర్తికావడం తథ్యంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -