Thursday, March 28, 2024
- Advertisement -

ఏపీ మంత్రి భార్య‌కు చుక్క‌లు చూపించిన టోల్ గేట్ సిబ్బంది

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి టోల్‌గేట్ వ‌ద్ద నానా హంగామా చేశారు. ఫీజు విషయంలో టోల్ సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగారు.తన కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది కాబట్టి తాను టోల్ ఫీజు చెల్లించననీ, తనను ముందుకు పోనివ్వాలని డిమాండ్ చేశారు. తాను మంత్రి భార్యంటూ హ‌ల్ చ‌ల్ చేశారు. అయితే, టోల్ ఫీజు కట్టకుండా కారును పోనిచ్చేందుకు అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో చివరికి చిర్రుబుర్రులాడుతూ టోల్ ఫీజు కట్టిన వెంకటకుమారి ముందుకు కదిలారు.

వెంకటకుమారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ దారిలో నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలోని టోల్‌గేటు వద్దకు చేరుకున్నారు. సాధారణంగా టోల్‌ గేటు వద్ద మంత్రులు, ఆపై స్థాయి నాయకులకు ఉచితం ఉంటుంది. మంత్రిగారి భార్య కారు టోల్ గేట్ వ‌ద్ద‌కు రాగానె టోల్ ఫీజుగా రూ.40 కట్టాలని సూచించారు. అయితే తాను మంత్రి భార్యననీ, తన కారుకు స్టిక్కర్ ఉందని వెంకటకుమారి చెప్పారు. తాను ఫీజును కట్టనని స్పష్టం చేశారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది నిబంధనలు వివరించినా ఆమె పట్టించుకోలేదు.. నేను మంత్రి గారి భార్యను నన్నే టోల్ గేటు ఫీజు అడుగుతారా అంటూ వారితో గొడవపెట్టుకున్నారు.

ఫీజు కట్టాల్సిందేనని అక్క‌డి సిబ్బంది డిమాండ్ చేశారు. లేకుంటె కారును ముందుకు క‌ద‌ల‌ద‌ని తేల్చి చెప్పారు.ఫీజు విషయంలో ఉచితం మంత్రిగారికే తప్ప.. ఆ కారు వేసుకుని వచ్చిన ప్రతి ఒక్కరికీ ఉండదని తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమి లేక టోల్ సిబ్బందిపై చిర్రుబుర్రులాడుతూ ఫీజు కట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు వెంకట కుమారి. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -