Friday, March 29, 2024
- Advertisement -

జగన్, బాబులకు పోటీగా కాంగ్రెస్ నాయకుడితడే

- Advertisement -

లాస్ట్ బాల్ వరకు ఆడి ఏపీ ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డుకున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీ విభజన చేస్తానన్న సొంత పార్టీ కాంగ్రెస్ నే ఎదురించిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు. ఏపీ విభజన పూర్తయ్యింది. ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఈ నేపథ్యంలో ‘జైసమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి కిరణ్ కూడా దారుణంగా ఓడిపోయి రాజకీయాలకు దూరమయ్యారు.

ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ రోల్ మాత్రం పోషించడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది. రాహుల్ రాజీనామా చేసేశారు. ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్న రఘువీరారెడ్డి కూడా బాధ్యతలు వదిలేశారు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ పీసీసీ పీఠంపై ఇప్పుడు జగన్, బాబులను తలదన్నే నాయకుడిని కాంగ్రెస్ తీసుకువస్తోందన్నది తాజా టాక్.

తాజాగా కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని అధిష్టానం ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినా ఆయన కాంగ్రెస్ నే నమ్ముకొని ఉండడంతో కిరణ్ ను పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి భవిష్యత్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యిందట..

అయితే ఏపీలో కుదేలైన కాంగ్రెస్ ను లేపడం.. వైసీపీ, టీడీపీలంతా బలంగా మార్చడం ఇప్పట్లో అయ్యే పని కాదు.. పైగా బీజేపీ దూసుకువస్తోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి కిరణ్ ఏమేరకు కాంగ్రెస్ ను నిలబెడుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -