Friday, March 29, 2024
- Advertisement -

మరో భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన జగన్..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీల ఎత్తులు కొంత అపహాస్యంగా, నవ్వుతెప్పించే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ జగన్ పై చేసే అతి కి ప్రజలకు నవ్వుకుంటున్నారు.. వచ్చే ఎన్నికల్లోనూ తాము గెలవలేమని తెలిసిన టీడీపీ కి ప్రతి విషయంలో జగన్ ను విమర్శించడం ఎంతవరకు విజ్ఞత వారికే తెలియాలి.. ప్రజలకు దగ్గరవ్వాలంటే ప్రజల సమస్యలు గుర్తించి ప్రభుత్వం పై పోరాడాలి తప్పా ఇలా అన్నిటికి సీఎం జగన్ కారణమంటే ఎలా అని ప్రజల్లోనే ఓ వర్గం వాదిస్తున్నారు..

ప్రజల్లో అమోఘమైన ప్రతిష్టను పోగుచేసుకుంటున్న ప్రభుత్వంపై బురదజల్లడం ద్వారా తక్కువ సమయంలోనే తమను తాము నిరూపించుకోవచ్చనే ప్రయత్నాలు అన్ని ప్రతిపక్ష పార్టీ ల్లో కనిపిస్తుంది.. బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న కూడా జగన్ పై విమర్శలు చేస్తూ నానా రచ్చ చేస్తుంది..  టీడీపీ అయితే జగన్ ని అసలు విడిచిపెట్టకుండా విమర్శిస్తోంది.. తొమ్మిదేళ్ళ పాటు అన్నిరకాల ఎదురు దెబ్బలకు ఎదురొడ్డి, మూడున్నర వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర ద్వారా ప్రజల మనస్సుల్లో చెరగని ముద్రవేసుకున్నాడు ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ ని అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ వైసీపీ ఆగ్రహానికి గురవుతున్నారు..

ప్రతిపక్షాలు ఎంత చేస్తున్నా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళుతూనే ఉన్నాడు.. మొదటి ఏడాది సంక్షేమ పథకాల ఫై ఫోకస్ పెట్టిన జగన్ రెండో ఏడాది అభివృద్ధి పనులపై ఫోకస్‌ పెట్టారు. నిర్ణయం తీసుకున్నదే తడవుగా వెంటనే వాటిని ఆచరణలో పెడుతున్నారు. 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న ఏపీలో పోర్టులు, రేవుల అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల తరబడి ప్రతిపాదనల దశలోనే ఉన్న పోర్టులు, రేవుల నిర్మాణాన్ని సీఎం వైఎస్‌ జగన్‌.. ఆచరణలో పెడుతున్నారు. ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలపడంతో.. ప్రకాశం జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టులతోపాటు నాలుగు చేపల రేవుల నిర్మాణానికి టెండరు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని జుడీషియల్‌ రివ్యూకు పంపారు.

విడ్డూరం..జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..

మరో సంచలనానికి తెరతీసిన సీఎం జగన్..?

జగన్ లేఖ రాస్తే తప్పేముంది.. ఎందుకింత సీన్..?

చినబాబు ఇక ఇంటికే పరిమితమా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -