Thursday, April 25, 2024
- Advertisement -

మీరు రోడ్ల ప‌క్క‌న‌ నిమ్మకాయ సోడా తాగుతున్నారా..?

- Advertisement -

స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే చాలు శీత‌ల‌పానీయాల‌కు మంచి గిరాకి ఏర్ప‌డుతోంది. భానుడి ప్ర‌తాపం నుంచి సేదా తీర‌డానికి ప్ర‌జ‌లు కూడా కూల్ డ్రింకులు, సోడాలు, కొబ్బ‌రి బొండాలు వంటివి సేవిస్తుంటారు. అయితే ఎక్కువ శాతం ప్ర‌జ‌లు వీధుల్లో నిమ్మకాయ సోడా బండ్ల‌ను ఆశ్రయిస్తారు. దీని రేటు కేవ‌లం 10 రూపాయిలే కావ‌డంతో చాలామంది వీటిని సేవిస్తారు. అయితే మీరు తాగే నిమ్మకాయ సోడా ఎంత స్వ‌చ్ఛ‌మైన నీటితో చేస్తున్నారో ఒక్క‌సారి చెక్ చేసుకోండి. ఎంద‌కంటే మీరు తాగుతున్న‌ది మంచినీటితో కాద‌ని ఓ నిమ్మకాయ సోడా బండి అత‌ను నిరుపించాడు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఓ వ్యక్తి సోడా బండిని పెట్టుకున్నాడు. అయితే ఈ సోడాలో వాడే మంచి నీటిని అత‌ను అనుసరించిన మార్గం చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. ట్యాంక్ బండ్ ద‌గ్గ‌ర మొక్క‌ల‌కు నీళ్లు ప‌డుతున్న ఓ మహిళ దగ్గరకు ఈ డబ్బాను తీసుకెళ్లి పెట్టాడు. ట్యాప్ ద్వారా ప‌ట్టిన నీటిని ద్వారా సోడాలు అమ్ముతున్నాడు ఈ ప్ర‌బుద్ధుడు. అయితే ఎవ‌రో ఇదింతా వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. త‌న వ్యాపారం కోసం ఇలాంటి ప‌ని చేస్తాడా…? అని ఈ వీడియో చూసిన చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.



Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -