Thursday, April 25, 2024
- Advertisement -

జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు శుభవార్త…ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం…

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో విధించిన ఆంక్షలన్నింటినీ తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు పర్యటించే ప్రయత్నం చేసినా వారిని ఎయిర్‌పోర్టుల నుంచే వెనక్కి పంపించింది. దశలవారీగా ఆంక్షలు ఎత్తివేసిన ప్రభత్వం ఇప్పుడు తాజాగా ఆంక్షలన్నింటిని ఎత్తి వేసింది.

ఇటీవలె అజిత్ దోవల్ లాంటి కీలక అధికారులు కశ్మీర్‌లో పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. ఇక, ఇప్పుడు అక్కడ ఆంక్షలు ఎత్తివేశారు. దీనిపై సమాచార, పౌర సంబంధాల అధికారులు ఓ ప్రకటన చేశారు. ఫోన్ ల్యాండ్‌లైన్లను పూర్తి వినియోగంలోకి తెచ్చినట్టు తెలిపారు.ట్రాఫిక్ రద్దీ క్రమంగా పెరుగుతోందని, వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వాడకం కూడా పెరిగిందని ఓ అధికారి వెల్లడించారు.పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ మాత్రం అమలులో ఉంది. విధుల్లో ఉన్న సైనిక బలగాలను సైతం క్రమంగా వెనక్కు తీసుకుంటున్నామని రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -