Friday, April 26, 2024
- Advertisement -

కశ్మీర్ విషయంలో అంతర్జాతీయంగా పాక్ కు మరో ఎదురు దెబ్బ..

- Advertisement -

కశ్మీర్ అంశం భారత అంతర్గత వ్వవహారమని పాక్ కు సంబంధంలేదని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నా పాక్ పాలకుల్లో మాత్రం జ్ణానోదయం కలగడంలేదు. భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తాజాగా యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది.

కశ్మీర్‌లో పరిస్థితులు’ అనే అంశంపై మంగళవారం యూరోపియన్ పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా పలువురు మంత్రులు పాక్‌పై ధ్వజమెత్తారు.ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని, తాము ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని స్పష్టం చేశారు.కశ్మీర్ అంశంలో భారత్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టడానికి పాకిస్థాన్‌ చేస్తున్న ప్రయత్నాలు మరో ఎదురు దెబ్బ తగిలింది.

యూరోపియన్ కన్జర్వేటివ్స్ అండ్ రిఫార్మిస్ట్స్ గ్రూప్స్‌నకు చెందిన జియోఫ్రే వాన్ ఆర్డెన్ మాట్లాడుతూ.. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదులకు మద్దతుగా ప్రత్యేక సేవలను కొనసాగిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఈ ఉగ్ర‌వాదులు ఆకాశం నుంచి రాలిప‌డ‌లేద‌ని, వారంతా పొరుగుదేశం నుంచి వ‌స్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఉగ్ర‌వాద విష‌యంలో భార‌త్‌కు మ‌నం మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు.న్యాయపరంగా కశ్మీర్ అంతా భారత్‌కు చెందిందే అయినా పీఓకేను పాకిస్థాన్ ఆక్రమించుకుని అక్కడ ఉగ్రవాదులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

ఇట‌లీకి చెందిన పుల్వియో మార్టుసెలి అనే క్రిస్టియ‌న్ డెమోక్రాట్ కూడా ఈయూ స‌భ‌లో మాట్లాడారు. అణ్వాయుధాలు వాడుతామ‌ని పాక్ నేరుగా హెచ్చ‌రించింద‌న్నారు. యూరోప్‌లో పాక్ ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు పుల్వియో ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -