Thursday, April 18, 2024
- Advertisement -

అరుణాచల్‌ప్రదేశ్ ను వ‌ణికించిన వ‌రుస‌ భూకంపాలు….

- Advertisement -

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ను వ‌రుస‌గా నాలుగు భూకంపాలు వ‌ణికించాయి. శుక్రవారం మూడు సార్లు భూమి కంపించగా, ఇవాళ తెల్లవారుజామున మరోసారి భూమి కంపించింది. వరుసగా భూమి కంపిస్తుండడంతో ఎప్పుడు ప్రాణం మీదికి వస్తుందో అని అరుణాచల్‌ప్రదేశ్‌ వాసులు భ‌యం గుప్పిట్లో ఉన్నారు.

భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై వరుసగా 5.6, 3.8, 4.9, మరియు 5.5గా నమోదయ్యాయి. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం 2.52 గంటల సమయంలో రాష్ట్రంలోని ఈస్ట్‌కామేంగ్‌ ప్రాంతంలో తొలిసారి భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైంది. మధ్యాహ్నం 3.04 గంటల సమయంలో ఇదే జిల్లాలో మరోసారి (3.8 తీవ్రత), 3.21 గంటల సమయంలో మూడోసారి కురుంగ్‌ కుమేయ్‌ జిల్లాలో (4.9 తీవ్రత) మరోసారి భూమి కంపించింది.

శనివారం తెల్లవారుజామున 4:24 గంటల సమయంలో మరోసారి ఈస్ట్ కామేంగ్ జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కేవలం అరగంట వ్యవధిలో మూడుసార్లు భూమి తీవ్రంగా కంపించడంతో నివాసిత ప్రాంతాల జనం పైప్రాణాలు పైనే పోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -