కాంగ్రెస్ కు బాబు మొండి చెయ్యి చూపించాడా..?

423
As if Chandrababu Abhaya is giving a
As if Chandrababu Abhaya is giving a "hand"

చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే.. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు , ఏ ఎండకాగొడుగు, అనే పార్ట్లు ఆయనను చూసే పుట్టాయని చెప్పొచ్చు.. ఇంత అనుభవం, సీనియర్ నని చెప్పుకు తిరిగే ఆయనను సీజనల్ రాజకీయ నాయకుడని కొందరు అభివర్ణిస్తుంటారు.. ఇంతకి బాబు గారిని ఎందుకు ఇంతలా పొగుడుతున్నామంటే చంద్రబాబు ఈ ఎన్నికల ముందు వరకు బీజేపీ పై ఎలా పోరాటం చేశారో అఅందరికి తెలిసిందే.. అప్పుడు కాంగ్రెస్ తో జత కట్టి బీజేపీ ని సెంట్రల్ ఓడించినంత పని చేశారు..

ఆ టైం లో చంద్రబాబు మోడీ ని విమర్శించినంత గా అయన ప్రతిపక్షాలు కూడా విమర్శించి ఉండవు.. అనుకూల మీడియా కూడా ఢిల్లీతో బాబు డీ, బాబు దెబ్బకు మో‘డీలా’ వంటి శీర్షికలతో తన వెన్నుపోటు రాజకీయాన్ని అక్కడ ప్రదర్శించాలని చూశాడు.. అయితే ఇటు రాష్ట్రంలో, అటు దేశం మొత్తం చంద్రబాబు కు బుద్ధి వచ్చేలా చేశారు ప్రజలు.. రాష్ట్రంలో సర్వహక్కులు పోగొట్టుకోవడం తో పాటు సెంట్రల్ లో తాము తిట్టిన పార్టీ అధికారంలోకి రావడంతో ఒకే పిట్టకు రెండు దెబ్బలు గా మారిపోయింది చంద్రబాబు పరిస్థితి..

ఇక ఇప్పుడు చంద్రబాబు మరోసారి తన రాజకీయ పుస్తకంలోని మరో అంకాన్ని ఆచరిస్తూ మళ్ళీ బీజేపీ కి వంత పాడుతున్నారు.. అయితే బాబు మోడీపై చేసిన విమర్శలు, అమిత్‌ షాపై తిరుపతిలో రాళ్లు వేయించడం, మోదీ గో బ్యాక్‌ అంటూ ప్రదర్శించిన బ్యానర్లు కళ్ళముందు ఉన్నట్లే ఉన్నాయంట.. తాజాగా జరిగిన ఓ సంఘటన తో సమయం చిక్కినప్పుడుల్లా బాబు బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అని తెలుస్తుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎన్‌డీఏ అభ్యర్థికి ఓటు వేసి బీజేపి మద్దతు కోరుతున్నామని చెప్పకనే చెప్పారు.. కాంగ్రెస్‌తో పొత్తును ఇప్పటి వరకూ బాబు అధికారికంగా తెంచుకోకపోయినా.. చర్యల ద్వారా తన వైఖరిని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ కు తన వెన్నుపోటు రాజకీయాన్ని రుచి చూపించడం లో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు..

Loading...