Saturday, April 20, 2024
- Advertisement -

ఓట‌మిపై ప‌రోక్షంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు…

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు ఎవ‌రు మాట్లాడుకున్నా అంద‌రూ సీఎం ఎవ‌రు అనే మాట్లాడుకుంటున్నారు. మొద‌టి ద‌శ‌లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అంద‌రి చూపు ఫ‌లితాపైనె. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు చాలా టైం ఉండ‌టంతో ప్ర‌జ‌లు, రాజ‌కీయ‌నాయ‌కుల్లో మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. వైసీపీ, టీడీపీ పార్టీలు విజ‌యంపై ధీమాగా ఉంటె జ‌న‌సేన అధ్య‌క్షుడు మాత్రం అజ్ణాతంలోకి వెల్లిపోయారు.

ఇప్ప‌టికే అన్ని స‌ర్వేలు వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చిచెప్పాయి. దీంతో జ‌గ‌న్ ఒక‌డుగు ముందుకేసి వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని నేనె సీఎ అవుతాన‌ని జ‌గ‌న్ కాన్ఫిడెంట్ గా ఉంటె బాబు మాత్రం పైకి ధీమాగా ఉన్నా లోప‌ల మాత్రం ఓట‌మి సీన్ అర్థ‌మైన‌ట్లుంది. అందుకే పోలింగ్ పూర్త‌యిన త‌ర్వాత కూడా బాబు నానా యాగిచేస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి వ‌స్తె ఈవీఎంలు మంచివ‌ని…ఓటమి చెందితే ఈవీఎంలు స‌క్ర‌మంగా ప‌నిచేయ‌డంలేద‌ని రెండు, మూడు రోజుల‌నుంచి బాబు ఆరోప‌న‌లు చేయ‌డం చూస్తున్నాం. త‌న ఓట‌మిని ఈసీ మీద వేయ‌డంకోసం నానా పాట్లు ప‌డుతున్నారు. అయితే తాజాగా బాబు చేసిన వ్యాఖ్య‌లు త‌న ఓట‌మిని ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీ ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం ఈవీఎంలు వ‌ద్ద బ్యాలెటే ముద్దు అంటూ దేశ వ్యాప్తంగా త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని ప‌లు ప్రాంతీయ పార్టీ నేత‌ల‌నేత‌ల‌ను క‌లుస్తూ హంగామా సృష్టిస్తున్నారు. వీవీ ప్యాట్లు పై సుప్రీకోర్టు తీర్పు ఇచ్చినా కూడా … ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసిన బాబు మాత్రంయాభై శాతం అయినా లెక్కించాల‌ని ప‌దే ప‌దే చెబుతున్న ఆయ‌న వైఖ‌రి వైఎస్ జ‌గ‌న్ సీఎం కాబోతున్నార‌నే విష‌యాన్ని బ‌య‌ట‌పెడుతోంది.

ఫ్ర‌స్ట్రేష‌న్‌లో భాగంగానె బాబు ఐఏఎస్‌ల మీద విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నె వాద‌న‌లు వినిపిస్తున్నాయి. తాజాగా టెలీకాన్ఫ రెన్స్‌లో పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌లు అధికారం చేజారుతోంద‌నే ఆయ‌న భ‌యాన్ని వ్య‌క్త ప‌రుస్తున్నాయి. జూన్ 8 వ‌ర‌కు నేనే ముఖ్య‌మంత్రిగా ఉంటాన‌ని …ఆ త‌రువాతే కొత్త ప్ర‌భుత్వం ఏర్పాడుతుంది..అంత‌వ‌ర‌కు స‌మీక్ష‌లు చేయ‌కుంటె ఎలాని బాబు ప్ర‌శ్నించిన‌ట్లు స‌మాచారం. బాబు మాట‌లు చూస్తె ప‌రోక్షంగా జ‌గ‌నే సీఎం అని ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -