Friday, April 19, 2024
- Advertisement -

ఎన్ఐఏ విచార‌ణ‌ పెఫెక్ట్‌… అజ్ణాతంలోకి వెల్లిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చౌద‌రి..

- Advertisement -

ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది ఎన్ఐఏ. కేసు విచారణలో భాగంగా విశాఖలోని కైలాసగిరి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకున్న ఎన్‌ఐఏ అధికారులు 3 రోజులుగా సాక్షులను విచారిస్తున్నారు.

హత్యాయత్నం జరిగిన గతేడాది అక్టోబర్‌ 25న ఘటనాస్థలంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ నోటీసులు పంపగా.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్‌ జియ్యాని శ్రీధర్‌ 2 రోజులక్రితం హాజరయ్యారు.

ఈ కేసులో కీలకంగా భావిస్తున్న టీడీపీ నేత, ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ చౌదరి మాత్రం పత్తా లేకుండా పోయారు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస రావు హర్షవర్ధన్ కు చెందిన విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఐఏ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు పంపినట్టు సమాచారం. హర్షవర్ధన్‌ సహా రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ హాజరుకాలేదు. పైగా హర్షవర్ధన్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది.

నిజానికి ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ కేంద్రంగానే కుట్ర జరిగిందని, హర్షవర్ధన్‌ చౌదరికి తెలియకుండా శ్రీనివాసరావు.. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసేంతటి ఘాతుకానికి తెగబడడన్న వాదనలు బలంగా వినిపించినా.. పోలీసులు, సిట్‌ అధికారులు హర్షవర్ధన్‌ జోలికే పోలేదు. ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్‌ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని ఎన్ఐఎ అధికారులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -