కీల‌క మ‌లుపు తిరిగిన ఆయేషా మీరా హత్య కేసు

312
Ayesha Meera murder case: CBI Preparations for re postmartam in ayesha murder case
Ayesha Meera murder case: CBI Preparations for re postmartam in ayesha murder case

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన అయేషా మీరా అత్య‌కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. 12 ఏళ్ల తర్వాత ఆమె మృతదేహానికి సీబీఐ రీపోస్టుమార్టం నిర్వ‌హించ‌నుంది. అయితే మృతదేహాన్ని పూడ్చిపెట్టి పదేళ్లు దాటిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అత్య జ‌రిగి 12 ఏళ్లు కావ‌స్తున్నా నిందితులు ఎవరన్న విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు కానీ అటు సీబీఐ కానీ తేల్చలేక పోయింది.దీంతో దాదాపు ఆయేష మర్డర్ జరిగి 12 సంవత్సరాల తరువాత అయేషా మీరా డెడ్ బాడీకి రీపోస్ట్ మార్టమ్ నిర్వహించాలని సీబీఐ అధికారులు సిద్దమవుతున్నారు.అయేషా మృతదేహానికి రీపోస్టుమార్టం చేస్తే ముస్లిం మతపెద్దల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నందున కోర్టు అనుమతి తీసుకోవాలని సీబీఐ అధికారులు యోచిస్తున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి ఆయేషా తల్లిదండ్రుల వద్ద డీఎన్ఏ‌ను కూడా సేకరించారు అధికారులు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్న అయేషా శాంపిల్స్‌‌తో డీఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో పరీక్షించనున్నారు. అయేషా హత్య జరిగినప్పుడు సేకరించిన శాంపిల్స్‌ను ఓ కానిస్టేబుల్ నాలుగు రోజుల పాటు దాచేశాడని గతంలో శంషాద్‌బేగం ఆరోపణలు చేశారు. దీంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్నవి అసలు అయేషా శాంపిల్సేనా? కాదా? అన్నది తేల్చేందుకు సీబీఐ సమాయత్తమవుతోంది.

Loading...